Medak Crime: వీడు అసలు మనిషేనా..? పండు ముసలిపై అఘాయిత్యం.. ఆపై గొంతు నులిమి హత్య..
- మెదక్ జిల్లాలో దారుణం..
- టేక్మాల్ మండలం సాలోజి పల్లి గ్రామంలో వృద్ధురాలిపై అత్యాచారం ఆపై హత్య..
- ఆ తర్వాత వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గుండ్లు ఎత్తుకెళ్లిన దుర్మార్గుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medak Crime: కామంతో కళ్లుచూసుకుపోయిన కామాంధులు.. చిన్నా చితక.. ముసలి ముతక అనే తేడా లేకుండా.. త వాంఛను తీర్చుకుంటున్నారు.. అంతేకాదు.. వారి ప్రాణాలను కూడా తీస్తున్నారు.. తాజాగా మెదక్ జిల్లాలో జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం సాలోజి పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శ్రీ దత్తాశ్రమంలో ఒంటరిగా నివాసముంటున్న వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గుండ్ల పై కన్నేసిన ఓ దుర్మార్గుడు.. ఆ గుండ్లను కాజేసేందుకు పన్నాగం పన్నాడు. మద్యం మత్తులో అర్ధరాత్రి సమయంలో ఆశ్రమంలోకి చొరబడి వృద్ధురాలు అంజమ్మ (75) పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత వృద్ధురాలి గొంతు నులిమి మట్టు బెట్టాడు.. అనంతరం వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గుండ్లను అపహరించి ఉడాయించాడు. అయితే, శివకుమార్ (28) అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డట్టుగా పోలీసులు తేల్చారు.
Read Also: Waqf board Bill: వక్ఫ్ బోర్డు మాఫియా వశమైంది.. ప్రతిపక్షాలపై కేంద్రం ఆగ్రహం..
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
టేక్మాల్ మండలం సాలోజిపల్లి గ్రామానికి చెందిన దుర్గయ్య, అంజమ్మ దంపతులకు నలుగురు సంతానం.. ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్లు. వీరిలో ఇద్దరు కుమారులు మృతి చెందారు. పెద్ద కూతురు సాలోజిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహాన్ని జరిపించారు. అనంతరం దుర్గయ్య అంజమ్మ దంపతులు వారి శేష జీవితాన్ని ప్రశాంతంగా దైవ చింతనలో గడిపేందుకు గత 20 ఏళ్ల క్రితం సాలోజిపల్లి గ్రామా శివారులో శ్రీ దత్తాశ్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడే వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో దుర్గయ్య గత కొద్ది సంవత్సరాల క్రితం కన్నుమూశాడు.. అయితే, దుర్గయ్య మృతి అనంతరం అంజమ్మ శ్రీ దత్తాశ్రమంలోనే ఒంటరిగా ఉంటూ తన శేష జీవితాన్ని గడుపుతుంది. ఈ నేపథ్యంలోనే అంజమ్మ కూతురు అల్లుడు ఆశ్రమానికి అప్పుడప్పుడు వచ్చి అంజమ్మ యోగక్షేమలపై ఆరా తీసేవారు. తమ వద్దే ఉండాలని కూతురు అల్లుడు ప్రాధేయపడిన అంజమ్మ నిరాకరించేదని అన్నారు. ఈ క్రమంలోనే నిన్న అర్థరాత్రి అంజమ్మ అల్లుడు తన విధులు ముగించుకొని ఆశ్రమంలో ఒంటరిగా ఉంటున్న తన అత్తగారిని రోజువారీగా భోజనం ఇచ్చి పలకరించేందుకు వెళ్లిన సమయంలో అంజమ్మ స్పృహ కోల్పోయి మిగతాజీవిగా పడి ఉండడాన్ని గమనిచాడు. చీకట్లో శివకుమార్ కూడా ఉండడంతో అనుమానంతో నిలదీసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో శివకుమార్ అంజమ్మ అల్లుడుపై కర్రతో దాడి చేసి పారిపోయాడు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దారుణ ఘటనతో అంజమ్మ కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు.
తాజావార్తలు
-
Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
-
Electronics Price Hike: టీవీ, ఏసీ, ఫ్రిజ్ ధరలు పెరిగే అవకాశం.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు
-
Virat Kohli: తల దించుకోవాలి.. సాకులు చెప్పొద్దు.. పరుగెత్తను అంటే కుదరదు!
-
Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!