Medak Crime: చిన్న వయస్సులో చదువుకుని, మంచి ఉద్యోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ.. కొందరు కుటుంబ పెద్దల తీసుకునే నిర్ణయాలతో
కన్న బిడ్డలను దూరం చేసుకోవాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ పెద్దల తప్పుడు నిర్ణయాలతో వారి కన్న బిడ్డలే చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరు పెట్టుకోవడం తప్పా ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. చిన్నప్పటి నుంచి కని పెంచి అల్లారు ముద్దుగా చూసుకునే తన కూతురు బలవంతం మరణానికి ఆ తల్లిదండ్రులే కారకులయ్యారు. పెళ్లి చేస్తే తమ కూతురు బాగుంటుందో అనుకున్నారో ఏమో తెలియదు కానీ.. 14 ఏళ్ల బాలికకు ఇష్టంలేని పెళ్లి చేసిన తల్లిదండ్రులకు విషాదమే మిగిలించింది. కుటుంబ పెద్దల నిర్ణయాలతో ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ లో చోటుచేసుకుంది.
Read also: Grandhi Srinivas: చంద్రబాబు మోచేతి నీళ్లు తాగేందుకు పవన్ సిద్ధమయ్యారు..
మెదక్ జిల్లా టేక్మాల్ లో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. తన 14ఏళ్ల కూతురుకి తన మేనబావతోనే పెళ్లి చేసేందుకు సిద్దమయ్యారు తల్లిదండ్రులు. అయితే ఆపెళ్లి తనకు ఇష్టం లేదని చేసుకోనని చెప్పిన తల్లిదండ్రలు వినిపించుకోలేదు. మేనబావతోనే నీ పెళ్లి చేస్తామని చివరకు ఈనెల 4న వివాహం చేశారు. తనకు ఇష్టం లేకపోయినా చివరకు ఆ బాలిక తల వంచి తాళి అయితే కట్టించుకుంది. తన తల్లిదండ్రులే కన్న బిడ్డను అర్థం చేసుకోలేదు ఇక కట్టుకున్నవాడు ఎలా చూసుకుంటాడో అనే అనుమానం వచ్చిందో.. తెలియదు కానీ.. ఇష్టం లేని పెళ్లి చేశారంటూ ఆవేదన చెందింది. చిన్నవయసులో బలవంతంగా పెళ్లి చేశారనే మనస్తాపంతో బాత్ రూమ్ లో వెళ్లిన బాలిక బయటకు రాలేదు. అయితే ఎంత సేపటికి బాలిక బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు తట్టినా మాట వినపడలేదు.. దీంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా చున్నీతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన బాలిక కనిపించింది. దీంతో అందరూ షాక్ లో ఉండిపోయారు. కుటుంబంలో ఒక్కసారిగా మనోవేదన మిగిలింది. ఇష్టంలేదని చెప్పిన కన్న బిడ్డ గొంతుకోసామని కన్నీరుమున్నీరుగా విలపించారు. అప్పుడు కన్న కూతురు మాట వినివుంటే ఇప్పుడు తనని పోగొట్టుకునే వారము కాదంటూ గుండెలు బాదుకున్నారు. అయితే ఈ విషయం తెలిసిన పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న బాలిక 9 రోజుల తరువాత ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? అత్తవారింట్లో ఏమైనా జరగిందా? అనే అనుమానంతో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Delhi Court : గ్యాంగ్‌స్టర్ కాలా జాతేడికి పెళ్లయిన వెంటనే పెద్ద షాకిచ్చిన ఢిల్లీ కోర్టు