బీఎస్పీ ఎంపీ మలక్ నగర్ మాట్లాడుతూ.. ఇండియా కూటమి నిజంగా బీజేపీని ఓడించాలనుకుంటే.. మాయావతిని భారత కూటమికి ప్రధాని అభ్యర్థిగా చేయాలని.. ఇది జరగకపోతే.. బీజేపీని గద్దె దించడం అసాధ్యం అని ఆయన చెప్పారు. మోడీని అడ్డుకునేందుకు బీఎస్పీతో పొత్తు అవసరం.
BSP: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి వారసుడిగా తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ని ప్రకటించినట్లు తెలుస్తోంది. యూపీ మాజీ సీఎంగా పనిచేసిన మాయావతి, ప్రస్తుతం రాజకీయంగా ఎదురుదెబ్బలు తింటున్నారు. గతంలో చూపిన విధంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభావం చూపించలేకపోతున్నారు. అధికారంలో బీజేపీ ఉండగా.. ప్రధాన ప్రతిపక్ష పాత్రను సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) పోషిస్తోంది.
MP Danish Ali: వివాదాస్పద ఎంపీ డానిష్ అలీని పార్టీ నుంచి బహిష్కరిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పార్లమెంట్‌లో డానిష్ అలీ, బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తనపై రమేష్ బిధూరి మతపరమైన వివక్ష, అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎంపీ డానిష్ అలీ ఆరోపించారు. ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది.
హుజన్ సమాజ్ పార్టీ (BSP) ఈ ఏడాది చివరలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం తన మొదటి ఏడుగురు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అభ్యర్థులను ప్రకటించిన ఏడు స్థానాల్లో ప్రస్తుతం నాలుగు అధికార బీజేపీ, మిగిలిన మూడు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి.
భారతీయ జనతా పార్టీ, విపక్ష పార్టీలు కానీ ప్రజల సంక్షేమం కోసం పని చేయడం లేదని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి అన్నారు. దళితులు, ముస్లింలు, మైనార్టీల కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏం చేయలేదని ఆమె అన్నారు. ఆ రెండు పార్టీలు ఒక్కటే.. అధికారంలోకి రాగానే.. వాళ్లు ఇచ్చిన వాగ్థానాలను మరిచిపోతారని బీఎస్పీ చీఫ్ ఆరోపించారు.
Mayawati: దేశవ్యాప్తంగా ‘యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)’పై చర్చ నడుస్తోంది. గత వారం ప్రధాని నరేంద్రమోడీ భోపాల్ లో జరిగిన ఓ సమావేశంలో యూసీసీ అమలుపై కీలక వ్యాఖ్యలు చేయడంతో దేశంలోని ఇతర ప్రధాన ప్రతిపక్షాలు దీనిపై కామెంట్స్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆప్,
పొత్తుపై మాయావతి ఆలోచన చేస్తున్నారా..? ప్రతిపక్ష ఐక్యతపై బీఎస్పీ కన్ను పడిందా?. బీహార్ రాజధాని పాట్నాలో జూన్ 23న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో జరగనున్న ప్రతిపక్ష పార్టీల సమావేశంలో బీఎస్పీకి చోటు దక్కలేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా అడుగులు వేయాలనుకున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం బీఎస్పీ విడుదల చేసిన ప్రెస్ నోట్ ద్వారా విపక్షాల ఐక్యతపై బీఎస్పీ కన్నేసిందని స్పష్టంగా తెలుస్తోంది. ఎస్పీ అధినేత్రి మాయావతి 2024 లోక్‌సభ…
యూపీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. చాలా రోజులుగా మౌనంగా,అజ్ఞాతంలో ఉండిపోయిన బీఎస్పీ అధినేత్రి మాయావతి మళ్ళీ ప్రజల ముందుకు వచ్చారు. యూపీ కాంగ్రెస్ చీఫ్, సీఎం అభ్యర్థినిగా ప్రచారం చేసుకుంటున్న ప్రియాంక గాంధీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలకు దిగారు. కాంగ్రెస్ కేవలం బీజేపీయేతర ఓట్లను చీల్చడానికే తప్ప, ఆ పార్టీతో వచ్చే ప్రయోజనం ఏమీ లేదని విమర్శించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు మాయావతి. ఆ పార్టీ సీఎం…
త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరప్రదేశ్ రాజకీయాలపై ప్రజలు ఆసక్తి కబరుస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఎవరు అధికారం చేజిక్కింకుంటారో.. వారిదే కేంద్రంలో అధికారం.. కాబట్టే ఆ రాష్ట్రం గురించిన చర్చ జోరుగా సాగుతోంది. మరోసారి అధికారాన్ని దక్కించుకుంటామని బీజేపీ సర్కారు ధీమా వ్యక్తం చేస్తుండగా.. కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, తదితర పార్టీలన్ని గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంలో ఉత్తరప్రదేశ్ సీఎంగా పని చేసిన మాయవతి తన అదృష్టాన్ని…