Mayawati: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి గురువారం ప్రశంసలు కురిపించారు. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), తన ప్రభుత్వ హమాంలో నిర్మించిన సంస్థలు, దళిత స్మారక చిహ్నాల నిర్వహణ విషయంలో అఖిలేష్ యాదవ్ రెండు ముఖాలతో వ్యహరించారని విమర్శించారు.
బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించినప్పుడే బీఎస్పీకి మంచిరోజులు వస్తాయని ఆ పార్టీ అధినేత మాయావతి వ్యాఖ్యానించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVMలు) బదులుగా బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) రాజకీయ పార్టీలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. బీఎస్పీ అధినేత్రి తన మేనల్లుడికి షాక్ ఇచ్చింది. ఆకాశ్ ఆనంద్ ను పార్టీ అన్ని పదవుల నుంచి తొలగించింది. దీంతో పార్టీకి ఇద్దరు కొత్త జాతీయ సమన్వయకర్తలు వచ్చారు. ఆకాష్ ఆనంద్ స్థానంలో ఆయన తండ్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్, రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్‌లను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తలుగా మాయావతి నియమించారు. బీఎస్పీ…
Mayawati: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలపై బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి స్పందించారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితికి కాంగ్రెస్ కారణమని ఆరోపించారు. కాంగ్రెస్‌పై విరుచుకుపడిన ఆమె.. రాజ్యాంగ సభకు డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్‌ని ఎన్నుకున్నందుకు శిక్షగా, హిందూ మెజారిటీ ప్రాంతం అయినప్పటికీ కాంగ్రెస్ బెంగాల్‌ని పాకిస్తాన్‌కి ఇచ్చిందని ఆరోపించారు. ఆ తర్వాత ఈ ప్రాంతం బంగ్లాదేశ్‌లో భాగమైందని చెప్పారు.
Mayawati: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో పార్టీ నేతని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) చీఫ్ మాయావతి సస్పెండ్ చేసింది. అయితే, అతను చేసిన తప్పు ఏంటంటే, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత కుమార్తెతో తన కొడుకు వివాహం జరిపించడమే. ఎస్పీ ఎమ్మెల్యే తిభువన్ దత్ కుమార్తెతో కొడుకు పెళ్లి చేసినందుకు సురేంద్ర సాగర్‌ని బీఎస్పీ నుంచి బహిష్కరించారు. ఇతడితో పాటు రాంపూర్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు ప్రమోద్ సాగర్‌ని తొలగించారు.
వన్ నేషన్-వన్ ఎలక్షన్‌కు బీఎస్పీ అధినేత మాయావతి జై కొట్టారు. మోడీ 3.0 సర్కార్ హయాంలోనే జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికే కేంద్రమంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. జమిలి ఎన్నికలు నిర్వహించి తీరుతామని ప్రకటించారు. ఇక బుధవారం కేంద్ర కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది. శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్ ఉభయసభల్లో బిల్లు తీసుకురానున్నారు.
Mayawati: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రిజర్వేషన్ బచావో సమితి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతుంది. దీనికి బీఎస్పీతో పాటు పలు రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి.
Hathras Stampede : జులై 2న హత్రాస్‌లో 121 మంది మరణించిన తొక్కిసలాటకు 'సత్సంగ్' నిర్వాహకులే కారణమని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆరోపించింది.
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యపై పార్టీ జాతీయాధ్యక్షురాలు మాయావతి స్పందించారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె.ఆర్మ్‌స్ట్రాంగ్‌ను నరికి చంపిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాయావతి తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.