Maternity Leave: ప్రసూతి సెలవు అనేది మహిళల ప్రసూతి ప్రయోజనాల్లో అంతర్భాగమని, మహిళల పునరుత్పత్తి హక్కుల్లో కీలకమైన భాగమని సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ఏ సంస్థ కూడా ఒక మహిళ ప్రసూతి సెలవుల హక్కుల్ని హరించలేవని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
బీహార్ విద్యాశాఖలో వింతైన సంఘటన వెలుగు చూసింది. ఒక మగ ఉపాధ్యాయుడికి మెటర్నిటీ లీవ్ మంజూరు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Odisha: ఒడిశాలో గర్భంతో ఉన్న ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగికి సెలవు నిరాకరించడంతో కడుపులోని బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది. కేంద్రపరా జిల్లాలో తన కార్యాలయంలో తీవ్ర ప్రసవవేదన అనుభవించిన మహిళ పురిటిలోనే బిడ్డను కోల్పోయింది. ఈ ఘటన అక్టోబర్ 25న జరిగింది. చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్(సీడీపీఓ) సెలవు నిరాకరించడంతో తాను బిడ్డను కోల్పోయినట్లు బర్షా ప్రియదర్శిని అనే 26 ఏళ్ల మహిళ మీడియాకు చెప్పడంతో మంగళవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. సరోగసీ ద్వారా తల్లులైనా ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ఆరు నెలల ప్రసూతి సెలవులు తీసుకోవచ్చు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం 50 ఏళ్ల నాటి నిబంధనను సవరించింది. సరోగసీ అంటే అద్దె గర్భం ద్వారా బిడ్డకు జన్మనివ్వడం. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సెలవులు) రూల్స్, 1972లో చేసిన మార్పుల ప్రకారం.. తల్లి (సరోగసీ ద్వారా జన్మించిన బిడ్డను మోస్తున్న తల్లి) పిల్లల సంరక్షణ కోసం సెలవు తీసుకోవచ్చు.. అంతేకాకుండా.. తండ్రి కూడా 15…
Maternity Leave : వివిధ రకాల ప్రయోజనాలను కంపెనీ ఉద్యోగులకు అందజేస్తుంది. వీరిలో మహిళలకు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యేక సెలవులు ఇస్తారు. అందులో ఒకటి ప్రసూతి సెలవు.
Himachalpradesh : హిమాచల్ ప్రదేశ్‌లో విద్యా శాఖ కింద పోస్ట్ చేయబడిన మహిళా కుక్‌లకు కూడా ఇప్పుడు ప్రసూతి సెలవు సౌకర్యం లభిస్తుంది. కొత్త విధానంలో అర్హులైన మహిళలు ఆరు నెలల సెలవు పొందనున్నారు.
Women Soldiers: మహిళా సైనికులకు కేంద్ర గుడ్‌న్యూస్ చెప్పింది. మహిళా సైనికులకు, నావికులకు, వైమానిక దళాల్లో పనిచేసే మహిళలకు వారి అధికారులతో సమానంగా ప్రసూతి, శిశు సంరక్షణ, పిల్లల దత్తత సెలవులకు కేంద్రం ఓకే చెప్పింది. సెలవులు మంజూరు చేసే ప్రతిపాదనకరు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ర్యాంకులో సంబంధం లేకుండా సాయుధ దళాల్లోని మహిళలందరిని సమానంగా చూడాలనే దానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది.
గత ఏడాది 11,000 మంది ఉద్యోగులను తొలగించిన ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా.. ఇప్పుడు మరో 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. కంపెనీలో రెండవ రౌండ్ తొలగింపుల వల్ల ప్రభావితమైన చాలా మంది ఉద్యోగులు ఇప్పుడు తమ కారణాలను వెల్లడిస్తున్నారు.
University In Kerala To Give 60 Days Maternity Leave To Pregnant Students: దేశంలో తొలిసారిగా ఓ యూనివర్సిటీ విద్యార్థినులకు మాతృత్వ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. పెళ్లి, పిల్లలు వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థినులను దృష్టిలో పెట్టుకుని కేరళ రాష్ట్రం కొట్టాయంలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే మహిళలకు మాత్రమే మాతృత్వ సెలవులను ఇస్తుంటారు. అయితే తొలిసారిగా ఓ యూనివర్సిటీ ప్రెగ్నెన్సీతో ఉన్న విద్యార్థినులకు…
మహిళా ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం… ఇప్పటి వరకు మహిళలకు ప్రసూతి సెలవులు కల్పిస్తూ వచ్చిన సర్కార్.. ఇప్పుడు ప్రసవం సమయంలోగానీ.. లేదంటే పుట్టిన కాసేపటికే గానీ బిడ్డ చనిపోతే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. బిడ్డ పుట్టిన వెంటనే చనిపోతే.. ఆ తల్లి జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుందని, అందువల్ల…