Jaish-e-Mohammad (JeM): పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్ తన వర్కింగ్ స్టైల్‌ను మార్చుకుంటోంది. ఎప్పుడూ లేని విధంగా జైష్ మహిళా ఉగ్రవాదుల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. జైష్ చీప్ మసూద్ అజార్ సోదరి సయీదా నేతృత్వంలో జమాత్-ఉల్-మొమినాత్ అనే మహిళా ఉగ్రవాదం సంస్థను ఏర్పాటైంది
Delhi Car Blast: ఢిల్లీ పేలుడు, ఫరీదాబాద్ పేలుడు పదార్థాల అక్రమ రవాణాలో జైష్ ఏ మహ్మద్ సంబంధాలను దర్యాప్తు చేస్తున్న అధికారులకు కీలక విషయం తెలిసింది. జైష్ కమాండర్, పుల్వామా దాడి సూత్రధారి ఉమర్ ఫరూక్ భార్య అఫిరా బీబీతో, ఢిల్లీ ఉగ్ర ఘటనతో సంబంధం ఉన్న మహిళా డాక్టర్ షాహీన్ సయీద్‌కు సంబంధాలు ఉన్నట్లు కనుగొన్నారు.
Delhi Bomb Blast: దేశ రాజధానిలో సోమవారం సాయంత్రం జరిగిన బాంబు దాడి తర్వాత దర్యాప్తు సంస్థలు కీలక ఆధారాలను కనుగొన్నాయి. 14 ఏళ్ల తరువాత రాజధానిలో జరిగిన అతిపెద్ద పేలుడుగా చెబుతున్నారు. అలాగే గత పార్లమెంటు దాడిలో నిందితుడు ఈ ప్రమాదంలో మరణించినట్లు కనుగొన్నారు. గతంలో నిరక్షరాస్యులపై వారు మాత్రమే ఉగ్రవాదం వైపు మొగ్గు చూపేవారని నమ్మేవాళ్లం. ప్రస్తుతం వైద్యులు, తదితర విద్యావంతులు ఉండటం గమనార్హం.
Masood Azhar: సోమవారం ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబ్ దాడితో దేశం ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. ఈ దాడి వెనక పాకిస్తాన్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోసారి కరడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజార్ పేరు వినిపిస్తోంది. ఐక్యరాజ్యసమితి ఇతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది.
Jaish-e-Mohammad: పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైష్-ఏ-మొహమ్మద్(జెఎం) తన మహిళా ఉగ్రవాద విభాగాన్ని ప్రారంభించింది. జమాత్-ఉల్-మోమినాత్ అనే మొదటి మహిళా జిహాదీ విభాగాన్ని ప్రారంభించింది. దీనికి జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరి సయీదా అజార్ నాయకురాలిగా బాధ్యతలు స్వీకరించింది.
Female Terrorists: పాకిస్థాన్ కేంద్రంగా మసూద్ అజార్ భారీ కుట్రకు తెరలేపాడు. ఆపరేషన్ సింధూర్‌లో దాదాపు తన కుటుంబాన్ని కోల్పోయిన పాకిస్థాన్ ఉగ్రవాది మసూద్ అజార్ తన కుట్రలను ఇంకా ఆపలేదని నిఘావర్గాలు తెలిపాయి. ఆయన ఇప్పుడు దాయాది దేశంలో మహిళా దళాన్ని ఏర్పాటు చేస్తున్నాడని సమాచారం. మహిళలను నియమించిన తర్వాత, వారు పూర్తి శిక్షణ పొంది ఉగ్రవాద పనిని కొనసాగించనున్నారు. ఈ విధంగా మహిళలను నియమించి ఉగ్రవాద శిక్షణ ఇచ్చిన ఉగ్రసంస్థ కేవలం జైషే ఒక్కటే…
Jaish-e-Mohammed: ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం చేతిలో చావుదెబ్బ తిన్నా కూడా పాకిస్తాన్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌కు బుద్ధి రావడం లేదు. ఉగ్రవాదం కోసం ఇప్పుడు మహిళలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. జైషే చీఫ్ మసూద్ అజార్ 21 నిమిషాల ఆడియోలో ఉగ్రవాదులుగా మహిళల్ని నియమించడం, శిక్షణ ఇవ్వడం గురించి ఉంది. పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రసంస్థ భారత వ్యతిరేక ప్రచారంతో బ్రెయిన్ వాష్ చేస్తోంది.
Pakistan: భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకు కకావికలమైన పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్.. తిరిగి పుంజుకునేందుకు కొత్త వ్యూహాలు అమలుచేస్తోంది. అందులో భాగంగా తొలిసారి ఆ సంస్థ మహిళా విభాగాన్ని ఏర్పాటుచేసినట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. సంస్థ అధిపతి మౌలానా మసూద్ అజహర్ పేరుతో విడుదల చేసిన లేఖలో "జమాత్ ఉల్ ముమినాత్" పేరుతో మహిళా విభాగాన్ని ఏర్పాటుచేసినట్లు గతంలో పేర్కొంది. కొత్తగా ఏర్పడిన మహిళా విభాగం "జమాత్ ఉల్-ముమినత్" కోసం నియామకాలను…
Parliament attack: ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ సీనియర్ ఉగ్రవాది మసూద్ ఇలియాస్ కాశ్మీరీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పాకిస్తాన్‌లో ఓ మతపరమైన కార్యక్రమంలో తన బాస్, జైషే చీఫ్ మౌలానా మసూద్ అజార్ చేసిన ఉగ్రవాద దాడుల గురించి చెబుతూ, అతడిపై ప్రశంసలు కురిపించారు.
Pakistan: జైషే మహ్మద్ ఉగ్రసంస్థ టాప్ కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గత వారం పాకిస్తాన్‌లోని బాలాకోట్ తహసీల్ లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమం ఉగ్రవాది కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం ఉన్న బహవల్పూర్పై భారత వైమానిక దళం దాడులు చేసింది. ఈ దాడిలో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు హతమయ్యారు. భారత్ ‘‘అజర్ కుటుంబాన్ని హతమార్చింది’’ని కాశ్మీరీ అంగీకరించారు.