Delhi Bomb Blast: దేశ రాజధానిలో సోమవారం సాయంత్రం జరిగిన బాంబు దాడి తర్వాత దర్యాప్తు సంస్థలు కీలక ఆధారాలను కనుగొన్నాయి. 14 ఏళ్ల తరువాత రాజధానిలో జరిగిన అతిపెద్ద పేలుడుగా చెబుతున్నారు. అలాగే గత పార్లమెంటు దాడిలో నిందితుడు ఈ ప్రమాదంలో మరణించినట్లు కనుగొన్నారు. గతంలో నిరక్షరాస్యులపై వారు మాత్రమే ఉగ్రవాదం వైపు మొగ్గు చూపేవారని నమ్మేవాళ్లం. ప్రస్తుతం వైద్యులు, తదితర విద్యావంతులు ఉండటం గమనార్హం.
READ MORE: Hyderabad: టీమిండియాలో హైదరాబాద్ కుర్రాడికి చోటు.. ఎవరో తెలుసా..?
అయితే.. తాజాగా మరో షాకింగ్ సమాచారం వెలువడింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ ఈ దాడికి పాల్పడిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే.. జైష్-ఎ-మహ్మద్‌ను ప్రమోట్ చేసే మదీనా అనే పత్రిక మే 2025లో ఓ సంచిక విడుదల చేసింది. ఢిల్లీలోని మొఘల్ కాలం నాటి భవనం సఫ్దర్‌జంగ్ సమాధి నుంచి ఒక మినార్ ఫొటోను పోస్టర్‌లో ప్రదర్శించింది. అంతే కాదు.. ఆ పత్రికలో ఓ కథనాన్ని ప్రచురిస్తూ.. ప్రత్యేకంగా “ఘజ్వా-ఎ-హింద్”, “జిహాద్‌కు సిద్ధం” అని ప్రస్తావించింది. దీంతో ఢిల్లీ బాంబు దాడుల వెనుక జైషే-ఎ-మొహమ్మద్ హస్తం ఉందని తెలుస్తోంది! ఆపరేషన్ సిందూర్ జైషే రహస్య స్థావరాన్ని నాశనం చేయడమే కాకుండా మసూద్ అజార్ కుటుంబాన్ని కూడా చంపింది. అప్పటి నుంచి మసూద్ అజార్ ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నాడు. ఈ దాడి ఆ ముర్ఖుడే చేసి ఉంటాడనే అనుమానాలు పెరుగుతున్నాయి. కానీ.. అటు ఉగ్రసంస్థ, ఇటు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
READ MORE: Delhi Blast 2025: ఢిల్లీ పేలుళ్లలో తెరపైకి PAFF పేరు.. ! PAFF ఏ ఉగ్ర సంస్థ అనుబంధమో తెలుసా?
ఈ దాడి మాత్రమే కాదు.. భారత్‌లోని మహిళలను ట్రాప్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఫరీదాబాద్‌లో అరెస్టయిన డాక్టర్ షాహీన్‌కు భారత్‌లోని మహిళలను జైషేతో అనుసంధానించే పని అప్పగించారు. దేశంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ అక్క ఆపరేషన్ సిందూర్‌లో హతమైంది. దీంతో మసూద్ అజార్ తన చెల్లెలికి జైష్-ఎ-మొహమ్మద్‌లోకి మహిళలను చేర్చుకునే బాధ్యతను అప్పగించాడు. అక్టోబర్‌లో, మసూద్ అజార్ జైష్‌లోకి మహిళలను చేర్చుకుంటున్నట్లు ప్రకటించాడు.