Masood Azhar: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్(జేఈఎం) చీఫ్ మౌలానా మసూద్ అజార్ గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. భారతదేశంలో పుల్వామా వంటి ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా ఉన్న అజార్, మోస్ట్ వాంటెండ్ టెర్రరిస్టుల లిస్టులో ఉన్నాడు. అతడి ఆరోగ్యం క్షీణించిన సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నాడని, చికిత్స కోసం పాకిస్తాన్ తరలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Masood Azhar: నిషేధిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్ చీఫ్, 2001 భారత పార్లమెంట్ దాడి సూత్రధారి మసూద్ అజార్ దాయాది దేశం పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఇటీవల పాకిస్తాన్ బహవాల్ పూర్‌లో ఒక ఇస్లామిక్ సెమినరీలో అజార్ ప్రసంగించిన వీడియోలు వైరల్‌గా మారాయి. దీంట్లో అతను భారతదేశంపై దాడులు కొనసాగిస్తామని చెప్పడం, ప్రధాని నరేంద్రమోడీపై అవమానకరమైన పదాలను ఉపయోగించడం కనిపించింది. దీంతో పాకిస్తాన్ తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
జైష్-ఎ-మహ్మద్ (JeM) చీఫ్ మసూద్ అజార్ పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. చనిపోయాడు లేదా విగత జీవిగా మారాడని గతంలో పలు మీడియా సంస్థలు అభివర్ణించాయి.
వరల్డ్ మోస్ట్ వాంటెడ్ మసూద్ అజార్ మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. తెల్లవారుజామున 5 గంటలకు గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన బాంబు పేలుడులో చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పాకిస్థాన్ ఇంకా ధృవీకరించలేదు. సోమవారం ఉదయం భవల్‌పూర్ మసీదు నుంచి తిరిగి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై బాంబు విసిరినట్లు కథనాలు వెలువడుతున్నాయి. దాడికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో మార్కెట్‌లో పేలుడు జరుగుతున్నట్లు కనిపిస్తోంది.…
Pakistan: పాకిస్తాన్‌లో భారత వ్యతిరేక ఉగ్రవాదులు ఒక్కొక్కరిగా హతమవుతున్నారు. ఎవరు చంపుతున్నారో..ఎందుకు చంపుతున్నారో అక్కడి ప్రభుత్వానికి అంతుబట్టడం లేదు. కిడ్నాప్ కావడమో, లేకపోతే ఏదైనా పనికోసం బయటకు వల్లే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఉగ్రవాదుల్ని లేపేస్తున్నారు. బయటకు వెళ్లిన ఉగ్రవాది ప్రాణాలతో ఉంటాడో లేడో తెలియని పరిస్థితి. భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని తమ సొంత ఆస్తులుగా పరిగణిస్తూ.. వారికి రక్షణ కల్పిస్తున్న పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి ఈ హత్యలు ఎవరు చేస్తున్నారని పాలుపోవడం లేదు. కిడ్నాప్…
Afghanistan comments on Masood Azhar and pakistan: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ విషయంలో పాకిస్తాన్ కు షాక్ ఇచ్చింది ఆఫ్ఘనిస్తాన్. జైషే చీఫ్ మసూద్ అజార్ ఆఫ్ఘనిస్తాన్ లోని నంగర్ హార్ ప్రావిన్స్ ప్రాంతంలో ఎక్కడో ఓ చోట తలదాచుకున్నాడని.. అతన్ని పాకిస్తాన్ కు అప్పగించాలని కోరుతూ.. పాకిస్తాన్ విదేశాంగా శాఖ ఆఫ్ఘనిస్తాన్‌కు లేఖ రాసింది. అతన్ని పట్టుకుని పాకిస్తాన్ దేశానికి అప్పగించాలని కోరింది. అయితే ఈ పాకిస్తాన్…
పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు ఆ దేశంలో యధేచ్చగా తిరుగుతున్నారు. వేల కోట్ల రూపాయలను ఉగ్రవాదులను తయారు చేయడానికి కొన్ని బడా సంస్థలు పెట్టుబడిగా పెడుతున్న సంగతి తెలిసిందే. అమెరికా సైన్యం హతమార్చిన ఒసామాబీన్ లాడెన్ సహా ఎంతో మందికి ఆ దేశం ఆశ్రయం ఇస్తోంది. రక్షణ కల్పిస్తోంది. 2001లో భారత పార్లమెంట్‌పై దాడికి ప్రధాన కుట్రదారుడైన మసూజ్ అజార్‌కు పాక్ ప్రభుత్వం రక్షణ కలిగిస్తోంది. ఉగ్రవాది అజార్ ప్రస్తుతం బహవల్‌పుర్‌లో రెండు…