ఎన్ని కఠిన శిక్షలు వచ్చినా నేరస్థుల్లో మార్పు రావడం లేదు. ఎక్కడొక చోటు దారుణాలు జరుగుతూనే ఉంటున్నాయి. ప్రేమ కారణంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. పెళ్లికి చేసుకునేందుకు నిరాకరించిందన్న కోపంతో ఓ ప్రియుడు ఘాతుకానికి తెగబడ్డాడు. ప్రియురాలిని చంపి.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది.
ఆన్‌లైన్ ప్రేమికుడి కోసం అమెరికాకు చెందిన జాక్లిన్ ఫోరెరో అనే యువతి ఖండాంతరాలు దాటుకుని భారత్‌లోని ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘హాయ్’ అనే పలకరింపుతో మొదలైన స్నేహం.. చివరికి పెళ్లిపీటల దాకా వెళ్లింది. ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తారని చెప్పడానికి ఇదే చక్కటి ఉదాహరణ.
యూపీలోని కాన్పూర్ లో ఓ ప్రేమికుడు చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రేమికుడు.. తన ప్రియురాలి కుటుంబంపై బెదిరింపులకు పాల్పడ్డాడు. నీ కూతురిని తనకిచ్చి పెళ్లి చేయాలని.. లేదంటే రక్తం కళ్ల చూడాల్సి ఉంటుందని కుటుంబ సభ్యులను బెదిరించాడు. అంతేకాకుండా.. ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తే, అక్కడికెళ్లి తీసుకొస్తానని చెప్పాడు. అందుకే ఎవరితోనూ పెళ్లి చేయకని సూచించాడు.
16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు 23 ఏళ్ల యువకుడికి కర్ణాటక హైకోర్టు 15 రోజుల బెయిల్ మంజూరు చేసింది. అసలు విషయానికొస్తే.. బాధిత మహిళ ఓ పాపకు జన్మనిచ్చింది. బాధితురాలికి ఇటీవలే 18 ఏళ్లు కూడా నిండాయి. ఈ క్రమంలో.. ఇరువర్గాల కుటుంబాలు వారికి పెళ్లి చేసేందుకు సానుకూలంగా ఉన్నాయి. మరోవైపు.. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి బిడ్డకు జీవనాధారమైన తండ్రి అని…
ఈ యేడాది చివరిలోగా పాపులర్ బాలీవుడ్ పెయిర్స్ కొన్ని పెళ్ళి పీటలు ఎక్కబోతున్నాయనే ప్రచారం బాగా జరుగుతోంది. అలియాభట్, రణబీర్ కపూర్ తో పాటు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ సైతం త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నారనే రూమర్స్ విశేషంగా స్ప్రెడ్ అవుతున్నాయి. డిసెంబర్ లో క్రతినా-విక్కీ వివాహం రాజస్థాన్ లో జరుగబోతోందని, దీపావళి రోజున రోకా ఫంక్షన్ కూడా జరిగిందని అంటున్నారు. ఇదిలా ఉంటే, దాదాపు పదేళ్ళుగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న రాజ్…
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్నారు. తన ఫియన్సీ క్యారీ సైమండ్స్ ను జాన్సన్ పెళ్లి చేసుకున్నారు. శనివారం రోజున లండన్ లోని వెస్ట్ మినిస్టర్ రోమన్ క్యాథలిక్ క్యాథడ్రల్‌లో ఈ వివాహ కార్యక్రమం ముగిసింది. బోరిస్ జాన్సన్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని అక్కడి మీడియా పేర్కొంది. దీనిపై బోరిస్ జాన్సన్ అధికారిక కార్యాలయం 10 డౌనింగ్ స్ట్రీట్ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. దీనిపై మాట్లాడటానికి మీడియా నిరాకరించినట్లు మీడియా తెలిపింది.…