ఎన్ని కఠిన శిక్షలు వచ్చినా నేరస్థుల్లో మార్పు రావడం లేదు. ఎక్కడొక చోటు దారుణాలు జరుగుతూనే ఉంటున్నాయి. ప్రేమ కారణంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. పెళ్లికి చేసుకునేందుకు నిరాకరించిందన్న కోపంతో ఓ ప్రియుడు ఘాతుకానికి తెగబడ్డాడు. ప్రియురాలిని చంపి.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. పెరిగిన పసిడి ధరలు
జాకీ నాట్, కాజల్ కుమార్ ప్రేమించుకున్నారు. అయితే వేర్వేరు కులాలు కావడంతో అనంతరం జాకీ నాట్‌ను పెళ్లి చేసుకునేందుకు ఆమె నిరాకరించింది. దీంతో జాకీ నాట్ కోపం పెంచుకున్నాడు. బీహార్‌లోని రోహ్తాస్ జిల్లాలోని ఒక ప్రైవేటు గెస్‌హౌస్‌కు కాజల్ కుమార్‌ను తీసుకెళ్లాడు. ఏం గొడవ జరిగిందో ఏమో తెలియదు గానీ.. అనంతరం తుపాకీ తీసుకుని కాజల్ కుమార్‌ను కాల్చి చంపాడు. అనంతరం జాకీ నాట్ కూడా తనకు తానుగా కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
ఇది కూడా చదవండి: Trump: ఆ కార్డులాడితే చైనా వినాశనమే.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
కాజల్ కుమారి తల్లి గాయత్రి దేవి మాట్లాడుతూ.. తన కూతురు ఒక మాల్‌లో పనిచేస్తుందని.. కొన్ని గంటల ముందే మార్కెట్‌లో దింపి వచ్చినట్లు తెలిపింది. తన కూతురిని బల్లియాకు చెందిన ఒక వ్యక్తి హోటల్ గదిలో కాల్చి చంపాడనే విషయం తెలిసిందని కన్నీరుమున్నీరు అయింది. పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నాడని.. ఒప్పుకోకపోవడంతో చంపేశాడని వాపోయింది. తనకు దక్కని అమ్మాయి.. మరొకరికి దక్కకూడదన్న కారణంతోనే చంపేశాడని విలపించింది. అయినా వేరే కులానికి చెందిన వాడిని ఎలా పెళ్లి చేసుకుంటుందని ఆమె ప్రశ్నించింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. జాకీ కాజల్‌పై కాల్పులు జరిపిన తర్వాత తనకు తాను కాల్చుకుని నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోందని పోలీసులు చెప్పారు. బాధిత మహిళను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి వారణాసిలోని ఆస్పత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ చనిపోయింది. తుపాకీ, కార్ట్రిడ్జ్ షెల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.