ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరీలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. తన భార్య ప్రేమ వ్యవహారంతో విసిగిపోయిన భర్త.. పంచాయితీ పెద్దల ముందు ఆమెను ప్రియుడికి అప్పగించాడు. నిఘాసన్ ప్రాంతంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జార్ఖండ్‌లోని ఖర్బానీకి చెందిన ఓ మహిళ 18 సంవత్సరాల క్రితం అదే ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడిని వివాహం చేసుకుంది.
Marital Dispute: 40 ఏళ్ల టెక్ ప్రొఫెషనల్ ఆదివారం బెంగళూర్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని ప్రశాంత్ నాయర్‌గా గుర్తించారు. వైవాహిక వివాదం కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. మృతుడు లెనోవా లో సీనియర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మీరట్ కు చెందిన ముస్కాన్ కేసు ఇంకా చల్లార లేదు. తాజాగా ముజఫర్ నగర్ నుంచి మరో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ రెండేళ్ల క్రితమే వివాహమైన పింకీ అనే మహిళ తన భర్తను చంపడానికి ప్రయత్నించింది. కాఫీలో విషం కలిపి భర్తను చంపడానికి ఆమె కుట్ర పన్నింది. ఈ సంచలనాత్మక కేసులో బాధితుడి సోదరి ఫిర్యాదు మేరకు.. పోలీసులు పింకీపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
భార్య కాపురానికి రావడం లేదని.. తల్లిదండ్రులపై కొడుకు కత్తితో దాడి చేసిన ఏపీలోని అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజంపేట (మం) బలిజపల్లి పూసల కాలనీలో బుధవారం తెల్లవారుజామున తల్లిదండ్రులపై కుమారుడు కత్తితో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు.
Police Constable:భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం హైదరాబాద్ మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నవీన్ తెలిపిన వివరాల ప్రకారం, సైదాబాద్ డివిజన్ ఆస్మాన్‌ఘడ్ ఎస్టీ బస్తీకి చెందిన జాతావత్ కిరణ్ (36) ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అతనికి భార్య లలిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యం తాగే అలవాటు ఉన్న అతను భార్యతో తరచూ గొడవపడేవాడు. నాలుగైదు రోజులుగా…