భార్యాభర్తల మధ్య సంబంధం ప్రేమ, సంఘర్షణతో ముడి పడి ఉంటుంది. ఈ సంబంధం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఇద్దరి మధ్య అనుమానం తలెత్తితే.. వారి మధ్య దూరం పెరుగుతుంది. లేదా ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో అలాంటి ఓ ఘటన చోటు చేసుకుంది. భార్త మీద అనుమానంతో భార్య చేసిన పని గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే. భోపాల్‌లోని బజారియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భార్య తన భర్త ముక్కు కొరికింది. గాయాలతో ఆ భర్త పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
READ MORE: Thummala Nageswara Rao: రాష్ట్రంలో యూరియా కొరత.. మరోమారు కేంద్రానికి లేఖ రాసిన మంత్రి తుమ్మల..!
బజారియా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ శిల్పా కౌరవ్ ప్రకారం.. బాధితుడు సత్యం పౌడర్ సంస్థ యజమాని. సోమవారం రాత్రి ఏదో పని మీద ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. దీనికి సంబంధించి భార్య అతన్ని ఇంత సేపు ఎక్కడికి వెళ్లావ్ అని అడిగింది. భార్య ప్రశ్న విన్న భర్త ఆమెకు ఎలాంటి సమాధానం చెప్పలేదు. తర్వాత ఇద్దరి మధ్య వివాదం జరిగింది. వివాదం ముదిరి ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది. ఈ సమయంలో సహనం కోల్పోయిన భార్య భర్త ముక్కును తన పదునైన పళ్లతో కొరికింది. కొంత భాగం తెగిపోయింది. గాయపడిన వ్యాపారవేత్త బజారియా పోలీస్ స్టేషన్ కు చేరుకుని జరిగిన సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు. భర్త ఫిర్యాదు మేరకు భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. భర్తను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. నొప్పి, రక్తస్రావం ఉన్నప్పటికీ, భర్త బజారియా పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లాడని సమాచారం. ముక్కు గాయం తీవ్రంగా ఉందని శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తెలిపారు.
READ MORE: Minister Vakiti Srihari: బనకచర్ల, బీసీ అంశాలపై మంత్రి కీలక వ్యాఖ్యలు..!