భార్య కాపురానికి రావడం లేదని.. తల్లిదండ్రులపై కొడుకు కత్తితో దాడి చేసిన ఏపీలోని అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజంపేట (మం) బలిజపల్లి పూసల కాలనీలో బుధవారం తెల్లవారుజామున తల్లిదండ్రులపై కుమారుడు కత్తితో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. ప్రేమ్ సాయి(35) అనే వ్యక్తి.. తన తండ్రి శ్రీ రాములు(47) తల్లి నాగమ్మ (44)పై అతి కిరాతకంగా కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో.. గమనించిన స్థానికులు వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం.. మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
Read Also: WhatsApp voice message transcripts: వాట్సాప్ నుంచి క్రేజీ ఫీచర్.. యూజర్లకు ఇకపై ఆ టెన్షనే ఉండదు!
కాగా.. కొన్ని రోజులుగా కొడుకు ప్రేమ్ సాయి మానసిక పరిస్థితి సరిగా లేదు. ఈ క్రమంలో.. తన భార్య అతని వద్ద నుంచి వెళ్లిపోయింది. అయితే తన భార్య కాపురానికి రావడం లేదంటూ ఆగ్రహానికి గురయ్యాడు. తన తల్లిదండ్రుల వద్దనున్న కొడుకును తీసుకొని వెళుతుండగా.. వారు అడ్డుకోవడంతో ప్రేమ్ సాయి కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో.. వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని ప్రేమ్ అదుపులో తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Annamalai: ‘‘ ఏంటి బ్రో ఇది’’.. పొలిటికల్ “స్టార్” విజయ్‌పై అన్నామలై ఆగ్రహం..