Lok Sabha Elections 2024: తెలంగాణ సరిహద్దు, మావోయిస్టు ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో రేపే ఎన్నికలు జరగబోతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రపూర్ ఎంపీ స్థానాల్లో తొలి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి.
చత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు అన్నె సంతోష్ @ సాగర్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా.. బీజాపూర్ లో సంతోష్ మృతదేహాన్ని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో.. స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం (మం) స్వగ్రామం దస్తగిరిపల్లికి చేరింది. అయితే.. స్వగ్రామానికి తీసుకువచ్చిన వృద్ధ తల్లిదండ్రులు అంతక్రియలు నిర్వహిస్తున్నారు. అంత్యక్రియల్లో గ్రామస్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఎర్రజెండాలతో స్వాగతం పలికుతూ అంతిమయాత్ర నిర్వహించారు. కన్నీటి పర్యంతంతో గ్రామస్తులు…
ఛత్తీస్‌గడ్ సరిహద్దులో మరోసారి నక్సలైట్లు బీభత్సం సృష్టించారు. ఆశీర్‌గూడ సమీపంలోని 30వ జాతీయ రహదారిపై ప్రయాణికుల బస్సుతో సహా మూడు భారీ వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు నిర్వహించారు. బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా crpf బలగాలు ఇంజరంకుం తరలించారు. అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతా కారణాల దృష్ట్యా సుక్మా కొంట…
Telangana Elections2023: మావోయిస్టు ప్రాబల్యం ఉన్న సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలోని 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దు నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. అయితే 4 గంటల్లోపు పోలింగ్ కేంద్రంలో ఓటేయడానికి ఉన్న ప్రజలకు మాత్రం అవకాశం ఉంటుంది. 4 గంటల తర్వాత వచ్చే వారిని అధికారులు అనుమతించరు..
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా మట్ బేడ అటవీ ప్రాంతంలో సోమవారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మావోయిస్టు హతమయ్యాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దేవనగరం సమీపంలో మావోయిస్టు పార్టీకి కొరియర్లగా పనిచేస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 141 బెటాలియన్ సిబ్బంది నిర్వహించిన వాహన తనిఖీలలో వారు పట్టుబడ్డారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నట్లు కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్. జి తెలిపారు.
Maoist: తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల హెచ్చరిక లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. జగిత్యాల జిల్లాలో మావోయిస్టుల పేరుతో ప్రజా ప్రతినిధులను హెచ్చరిస్తూ లేఖలు రావడం చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది.
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఒక గ్రామంలో 16 ఏళ్ల క్రితం 11 మంది గిరిజన మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 21 మంది పోలీసులను ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడంలో ఇద్దరు దర్యాప్తు అధికారులు విఫలమైనందున నిందితులను ప్రాథమికంగా నిర్దోషులుగా విడుదల చేసినట్లు కోర్టు పేర్కొంది.