మావోయిస్టులు మళ్లీ పంజా విసురుతున్నారు.. వరుసగా దాడులకు దిగుతున్నారు.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో దాడులకు పాల్పడుతున్నారు.. ఇన్న బీజాపూర్ జిల్లాలోని కుత్రు పోలీసు స్టేషన్ పరిధిలోని ధర్బా దగ్గర పోలీసు క్యాంపుపై మెరుపుదాడికి పాల్పడ్డ మావోయిస్టులు.. ఇవాళ బర్సూర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని మంగనార్ గ్రామంలో పీఎంజీఎస్‌వై రోడ్డు నిర్మాణంలో నిమగ్నమైన ఏడు ట్రాక్టర్లను తగలబెట్టారు. ఈ ఘటనకు మావోయిస్టు ఈస్ట్ బస్తర్ డివిజన్ కమిటీ చేసింది. స్థానికుల చెబుతున్న వివరాల ప్రకారం.. మహిళలతో సహా…
ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల లేఖ కలకలం సృష్టించింది.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరుతో లేఖ విడదలైంది.. మైనింగ్ ముసుగులో బాక్సైట్ అక్రమ తవ్వకాలకు ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని ఆ లేఖలో ఆరోపించిన మావోయిస్టులు.. జీకే వీధి మండలం చాపరాతి పాలెంలో జరుగుతున్న మైనింగ్‌ను తరిమి కొట్టాలని పేర్కొన్నారు.. పార్టీలకు పదవులకు రాజీనామా చేసి మన్యం విడిచిపోవాలని హెచ్చరిస్తూ మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ పేరుతో…
విశాఖ మన్యంలో మావోయిస్టుల తాజా లేఖ కలకలం రేపుతోంది… అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని హెచ్చరిస్తూ లేఖ రాశారు మావోయిస్టులు.. లేట్రైట్ మైనింగ్ ముసుగులో బాక్సైట్ అక్రమ తవ్వకాలకు ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని ఆ లేఖలో ఆరోపించిన మావోయిస్టులు.. జీకే వీధి మండలం చాపరాతి పాలెంలో జరుగుతున్న మైనింగ్‌ను తరిమి కొట్టాలని లేఖ విడుదల చేశారు.. పార్టీలకు పదవులకు రాజీనామా చేసి మన్యం విడిచిపోవాలని లేఖలో డిమాండ్ చేసింది మావోయిస్టు పార్టీ…
మావోయిస్టు కీలక నేత హరిభూషన్ భార్య సమ్మక్క అలియాస్ శారద లొంగిపోయిన విషయాన్ని అధికారికంగా వెల్లడించారు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి… 1994లో 18 ఏళ్ల వయస్సులోనే పాండవ దళంలో కమాండర్‌గా పనిచేస్తున్న హరిభూషన్… శారదను మైనర్‌గా ఉన్నప్పుడే పార్టీలోకి తీసుకెళ్లారని తెలిపారు. ఆమె కిన్నెర దళంలో 1997 నుండి 1998 వరకు పనిచేసిందని వెల్లడించిన ఆయన.. 1999-2000 మధ్య నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ మెంబర్‌గా… ప్లాటున్ మెంబర్‌గా పనిచేశారన్నారు.. 2008లో వరంగల్ ఎస్పీ ముందు లొంగిపోయిన…
ఈ మధ్య మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి… పెద్ద సంఖ్యల్లో మావోయిస్టులు లొంగిపోతున్నారు.. మావోయిస్టు అగ్రనేతలు కరోనా బారినపడినట్టు ప్రచారం జరిగింది. కొంతమంది ఆస్పత్రిల్లో చేరి కూడా పోలీసులకు చిక్కారు.. తాజాగా మావోయిస్టు అగ్రనేత హరి భూషణ్ భార్య శారద లొంగిపోయారు.. గత కొంత కాలం నుంచి పార్టీకి హరి భూషణ్ కుటుంబం దూరంగా ఉంటోంది… కొన్ని రోజుల క్రితమే హరి భూషణ్ కుమారుడు లొంగిపోగా.. తాజాగా, ఖమ్మం పోలీసుల ముందు హరిభూషణ్ భార్య శారద…
ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మర్డర్ కేసులో కీలక నిందితుడైన మావోయిస్టు కమాండర్‌ను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం ముత్తరాసిచెట్లకు చెట్లకు చెందిన దుబాసి శంకర్ అలియాస్ రమేశ్‌ను అరెస్ట్ చేశారు ఒడిశా పోలీసులు. రెండు రోజుల కిందట పేటగూడ, నౌరా గ్రామాల అటవీ ప్రాంతంలో DVF, NOG, BSF సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో రమేశ్ పట్టుబడ్డాడు. సోమవారం ఉదయం నిర్వహించిన కార్డాన్ సెర్చ్‌లో.. హార్డ్‌కోర్ మావోయిస్ట్ దుబాసి…
మావోయిస్టు కీలక నేతను అరెస్ట్ చేశారు పోలీసులు.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టు కీలక నేత మోతీరామ్‌ను అరెస్ట్ చేశారు.. మోతీరామ్‌పై రూ.20 లక్షల రివార్డు ఉన్నట్టుగా చెబుతున్నారు పోలీసులు.. గతంలో సుక్మా జిల్లాలో 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను బంధించి.. చంపిన ఘటనలో మోతీరామ్ కీలక సూత్రధారిగా పోలీసులు చెబుతున్నారు. మోతీరామ్‌పై పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నాయి.. కాగా, ఈ మధ్య మావోయిస్టు ఉద్యమానికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూ వస్తున్నాయి.. ఈ మధ్యే ఖమ్మం…
టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై ఘాటు లేఖ విడుదల చేశారు మావోయిస్టులు.. తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఈ లేఖ విడుదలైంది.. ఈటల.. అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ ఇచ్చిన ప్రకటనను ఖండించిన తెలంగాణ మావోయిస్టు పార్టీ… తన ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేస్తూ కేసీఆర్ ఫ్యూడల్ పెత్తనానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడతానని అందుకోసం ఆర్ఎస్ఎస్ నుండి పోరాడాలని…