ప్రస్తుతం దేశంలో మావోల ఏరివేత కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు తమ ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలను పట్టించుకోని మావోయిస్టులను మాత్రం భద్రతా దళాలు అంతమొందిస్తున్నాయి.
వెరీటాస్ సైనిక్ స్కూల్ లో కీచకుడు.. విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన తెలుగు టీచర్ కొందరి ఉపాధ్యాయుల తీరు పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి మాయని మచ్చగా మారుతోంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు బోధించి సన్మార్గంలో నడిపించాల్సిన టీచర్స్ తప్పటడుగులు వేస్తున్నారు. తమ ప్రవర్తనతో, చేష్టలతో అపకీర్తి మూటగట్టుకుంటున్నారు. బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అత్యాచార యత్నాలకు పాల్పడడం వంటివి చేస్తున్నారు. తాజాగా సిద్ధిపేట జిల్లా ములుగు (మం) లక్ష్మక్కపల్లి గ్రామంలోని వెరీటాస్ సైనిక్ స్కూల్ లో కీచక టీచర్ బాగోతం…
Maoist Sunitha Surrender before Rachakonda CP: రాచకొండ సీపీ సుధీర్ బాబు ఎదుట మావోయిస్టు కీలక నేత కాకరాల సునీత లొంగిపోయారు. విరసంలో కీలక పాత్ర పోషించిన కాకర్ల సత్యనారాయణ కూతురే సునీత. అంతేకాదు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అలియాస్ టీఎల్‌ఎన్ చలం గౌతమ్ భార్య. చెన్నూరి హరీశ్ అలియాస్ రమణ కూడా ఈరోజు పోలీసుల ఎదుట లొంగిపోయారు. సునీత, రమణ కలిసి ఎన్నో ఎన్‌కౌంటర్లలో పాల్గొన్నారు. ఎన్నో ఏళ్ల అనంతరం జనజీవన…
ఏవోబీ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టు అగ్రనేత అరుణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. స్వస్థలం పెందుర్తి మండలం కరకవానీ పాలెంలో బంధు మిత్రులు, ప్రజాసంఘాలు అంతిమ వీడ్కోలు పలికాయి. అంతిమ యాత్రలో ‘కామ్రేడ్ అరుణ అమర్ ర హే’ నినాదాలు హోరెత్తాయి. కగార్ పేరుతో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ప్రజా సంఘాలు ఆరోపించాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అరుణ మరణించిన విషయం తెలిసిందే. ఏవోబీ ఈస్ట్ డివిజన్ సెక్రటరీగా…
Maoists : తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 20న బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఇటీవల జరిగిన ఆపరేషన్ కగార్ దాడిని ఖండిస్తూ ఈ బంద్‌ను ప్రకటించినట్లు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. ప్రకటనలో ప్రకారం, జూన్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ జరిగిన ఆపరేషన్ కగార్ పేరుతో నేషనల్ పార్క్ పరిధిలో చేపట్టిన దాడుల్లో రాష్ట్ర స్థాయి కీలక నాయకులైన కామ్రేడ్ టీఎల్ఎన్ఎస్ చలం అలియాస్ ఆనంద్, కామ్రేడ్…
ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని మల్కన్‌గిరి జిల్లా పోలీసులు కీలకమైన మావోయిస్టులను అరెస్టు చేశారు. మావోయిస్టు పార్టీ కంగేరి ఘాటి ఏరియా కమిటీ సభ్యుడు కేసా కవాసి, ఏవోవీ మిలటరీ ప్లాటును కమిటీ సభ్యుడు, ఏరియా కమిటీ సభ్యుడు రాకేష్ సాను కుంజమ్ లను అరెస్ట్ చేశారు..
Maoist Special Story : మావోయిస్టు పార్టీ నానాటికి ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది ..పార్టీ అగ్ర నాయకులను కోల్పోతుంది.. పార్టీ కేంద్ర నాయకత్వం పట్టు తప్పు పోతుంది.. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్కౌంటర్లో చనిపోగా ఇప్పుడు కిందిస్థాయి వాళ్లు కూడా ఎన్కౌంటర్లో చనిపోతున్నారు.. బతికున్న వాళ్లు చాలామంది లొంగిపోతున్నారు. మావోయిస్టు పార్టీ ఏర్పడిన వారు 44 మందితో కేంద్ర కమిటీ ఏర్పాటు అయింది ఇప్పుడు ఆ సంఖ్య 16కు తగ్గిపోయింది ఇందులో ఉన్నవాళ్లు చాలామంది ఎన్కౌంటర్లో చనిపోగా కొందరు…
మావోయిస్టుల మృతదేహాలు అప్పగించడంలో కేంద్ర ప్రభుత్వం కోర్టులను తప్పుదోవ పట్టించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించకపోవడంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులు చర్చలకు వస్తామన్నా కేంద్రం తిరస్కరించి వెంటాడి చంపుతామనే పద్ధతి అనుసరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శత్రుదేశం పాకిస్థాన్‌తోనే చర్చలు జరిపి యుద్ధం ఆపేశారని, మావోయిస్టులు భారత పౌరులు అయినా చర్చలు చేయమంటారా? అని రామకృష్ణ ప్రశ్నించారు. మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు…
Dantewada Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో జరిగిన ఎన్కౌంటర్లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC)కి చెందిన ఒక మహిళా మావోయిస్టుతో పాటు చాలా మంది మావోయిస్టులు మరణించారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో తెలంగాణ వరంగల్ జిల్లాకు చెందిన మహిళా మావోయిస్ట్ రేణుక అలియాస్ బాను మరణించింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్ట్ వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా జిల్లా రిజర్వ్…