Telangana Elections2023: మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని 13 నియోజకవర్గాల్లో 4 గంటలకే ముగిసిన పోలింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Elections2023: మావోయిస్టు ప్రాబల్యం ఉన్న సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలోని 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దు నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. అయితే 4 గంటల్లోపు పోలింగ్ కేంద్రంలో ఓటేయడానికి ఉన్న ప్రజలకు మాత్రం అవకాశం ఉంటుంది. 4 గంటల తర్వాత వచ్చే వారిని అధికారులు అనుమతించరు..
Read Also: NTR: మీరు ఓట్లు వేయరా.. రిపోర్టర్స్ కు సెటైర్ వేసిన ఎన్టీఆర్
Also Read
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
- Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
- Telangana 22A Land Issues: 22ఏ భూ సమస్యల పరిష్కారానికి హైలెవల్ కమిటీ.. రేపటి నుంచే దరఖాస్తులు
సిర్పూర్, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం వంటి నియోజకవర్గాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను ఆనుకుని ఉన్నాయి. ఈ 13 నియోజకవర్గాల్లో మావోయిస్టు ప్రాబల్యం ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడ 4 గంటల వరకే పోలింగ్‌కి అనుమతించింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గాలన్నీ ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. ఇవి తప్పా.. రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల సమయంలో కూడా తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న గడ్చిరోలి, బీజాపూర్, దంతెవాడ, జగ్దల్పూర్ వంటి జిల్లాల్లో కూడా ఇదే విధంగా 4 గంటల వరకే ఓటేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. ప్రస్తుతం తెలంగాణలో ఈ 13 నియోజకవర్గాలు కూడా ఈ జిల్లాల సరిహద్దుల్లోనే ఉన్నాయి.
తాజావార్తలు
-
India Women Cricket: 5 ఓవర్లలోనే టార్గెట్ ఉఫ్.. టీ20ల్లో భారత మహిళల జట్టు సరికొత్త రికార్డు!
-
Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
-
DADA Movie : ‘దాదా’టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
ట్రెండింగ్
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?