Illicit Relationship: కోడి కత్తులతో విచక్షణారహితంగా దాడి.. యువకుడి దారుణ హత్య!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Illicit Relationship: వారు నలుగురు మంచి స్నేహితులు.. ఊరిలో ఎక్కడికి వెళ్లాలన్నా.. అందరూ కలిసే వెళ్లేవారు.. పార్టీలు చేసుకునే వారు.. కానీ ఆందులో ఒకరు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఇది ఎవరు చేశారనే దానిపై మిస్టరీ వారం రోజులపాటు కొనసాగింది. చివరికి ముగ్గురు స్నేహితులే ఒకరిని మట్టుబెట్టారని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఇంతకీ స్నేహితున్ని అంత దారుణంగా ఎందుకు చంపారు? దీనిపై శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
- Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
- HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
- Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలం పెద్ద కోడిపల్లి గ్రామం. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈ గ్రామంలో ఫిబ్రవరి 3న ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ హత్యతో ఒక్కసారిగా గ్రామంలో కలకలం రేగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు షురూ చేశారు. హత్యకు గురయిన వ్యక్తిని లింగమయ్యగా గుర్తించారు. ఐతే వారం రోజుల తర్వాత ఈ కేసుకు సంబంధించిన మిస్టరీ వీడింది. హత్యకు ప్రధాన కారణం వివాహేతర సంబంధంగా గుర్తించారు.
అసలు విషయానికి వస్తే.. చనిపోయిన వ్యక్తి లింగమయ్య, మనోజ్, నవీన్, ప్రభాస్ నలుగురు స్నేహంగా ఉండేవారు. ఈ క్రమంలో లింగమయ్యకు మనోజ్‌కు వరుసకు చెల్లెలు అయ్యే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర బంధానికి దారి తీసింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా మనోజ్‌కు తెలిసింది. దీంతో లింగమయ్యను పలుమార్లు హెచ్చరించాడు మనోజ్. కానీ లింగమయ్య పెడచెవిన పెట్టాడు. మరోవైపు గ్రామంలో ఈ విషయం గురించి చర్చించుకోవడం అవమానంగా భావించిన మనోజ్.. లింగమయ్యను తుదిముట్టించాలని ప్రణాళిక వేసుకున్నాడు. ఈ విషయాన్ని స్నేహితులకు తెలియజేసి పక్కా ప్లాన్ రెడీ చేశాడు.
Anil Ambani: చిక్కుల్లో అంబానీ ఫ్యామిలీ.. అనిల్ అంబానీ భార్యకు ఈడీ సమన్లు..
అందరూ అనుకున్న పథకం ప్రకారం.. ఫిబ్రవరి మూడో తేదీన సాయంత్రం గ్రామ శివారులో ఈ విషయమే చర్చించాలని లింగమయ్యను అక్కడికి పిలిచారు. మనోజ్ ఈ విషయమే చర్చిస్తూ పథకం ప్రకారం తన వద్దనున్న కోడి కత్తులతో విచక్షణారహితంగా లింగమయ్య పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన లింగమయ్య అక్కడికక్కడే మరణించాడు. దీంతో అక్కడి నుంచి ముగ్గురు పారిపోయారు. ఈ విషయమై లింగమయ్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరికి నిందితులను రొద్దం మండలం పెద్దమంతూరు వద్ద ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు.
తాజావార్తలు
-
Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
-
Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
-
AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో ‘ఏఐ’ విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!