ఛత్తీస్‌గడ్ సరిహద్దులో మరోసారి నక్సలైట్లు బీభత్సం సృష్టించారు. ఆశీర్‌గూడ సమీపంలోని 30వ జాతీయ రహదారిపై ప్రయాణికుల బస్సుతో సహా మూడు భారీ వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు నిర్వహించారు. బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా crpf బలగాలు ఇంజరంకుం తరలించారు. అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించాయి.
ఈ క్రమంలో భద్రతా కారణాల దృష్ట్యా సుక్మా కొంట రహదారిపై ట్రాఫిక్‌ను నిలిపివేశారు. కాగా ఈ నెల 22న నిర్వహించే బంద్‌ను విజయవంత చేయాలని పిలుపునిస్తూ మావోలు ఈ విధ్వంసం సృష్టించినట్టు సమాచారం. ఇందుకోసం 30 నెంబర్ జాతీయ రహదారిపై సుక్మా కుంట సమీపంలో తెలంగాణ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును ఆపీ ప్రయాణికులు దించి బస్సుకు నింపి అట్టించారు. అనంతరం బంద్ విజయంతం చేయాలని నినాదాలు చేస్తూ అక్కడి నుంచి సుక్మా జిల్లా జిల్లా జేగురుగొండ వద్ద ఓ లారీని దగ్ధం చేశారు. అక్కడ నుంచి బీజాపూర్ జిల్లా మంచిర్యాల జాతీయ రహదారి సమీపం లో మరో లారీ నీ దగ్ధం చేశారు.