Maoists: 3 రాష్ట్రాల సీఎంలకు మావోల లేఖ.. సారాంశం ఇదే!
- 3 రాష్ట్రాల సీఎంలకు మావోల లేఖ
- మూడు జోనల్‌కు ప్రతినిధిగా ఉన్న అనంత్ అభ్యర్థన లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దేశంలో మావోల ఏరివేత కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు తమ ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలను పట్టించుకోని మావోయిస్టులను మాత్రం భద్రతా దళాలు అంతమొందిస్తున్నాయి. మార్చి నెల నాటికి మావో రహిత దేశంగా మార్చాలని కేంద్రం కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారతదేశంలో మావోల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు
Also Read
- Farmer Relief: కరువు వేళ రైతులకు దీపావళి కానుక.. ప్రతి రైతు ఖాతాలో రూ.5,000..!
- Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 78 రోజుల బోనస్‌కు క్యాబినెట్ ఆమోదం?
- Patna High Court: "మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం".. హైకోర్టు సంచలన తీర్పు..
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాలకు చెందిన మావోయిస్ట్ కమిటీ ప్రభుత్వాలకు లేఖ రాసింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా లేఖ రాసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌కు లేఖలు రాసింది. మూడు జోనల్‌కు ప్రతినిధిగా ఉన్న అనంత్ అభ్యర్థన లేఖ రాశాడు.
లేఖ సారాంశం ఇదే..
సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నామని.. ప్రభుత్వ పునరావాసం పథకంలో చేరాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. అయితే లొంగిపోవడానికి మూడు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు కోరాడు. తమ పార్టీ ప్రజాస్వామ్య కేంద్రకరణ సూత్రాలకు కట్టుబడి ఉందని.. సమిష్టి నిర్ణయానికి కొంత సమయం పడుతుందని.. సహచరులను సంప్రదించి సందేశం తెలియజేసేంత వరకు తమకు సమయం ఇవ్వాలని కోరాడు.
ఇది కూడా చదవండి: Supreme Court: సీజేఐగా సూర్య కాంత్ ప్రమాణస్వీకారం.. హాజరైన మోడీ
మావోయిజాన్ని అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గడువు మార్చి 31, 2026 లోపు మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు కొంత సంయమనం పాటించాలని, భద్రతా దళాల కార్యకలాపాలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశాడు. ఇకపై ఎలాంటి వారోత్సవాలు జరుపుకోబోమని.. ప్రస్తుతం ఆ కార్యక్రమాలన్నీ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నాడు. లేఖ అందిన తర్వాత ప్రభుత్వం నుంచి ఆహ్లాదకరంగా.. సానుకూలంగా నిర్ణయాలు వస్తాయని భావిస్తున్నట్లు తెలిపాడు. అలాగే మా సందేశం సహచరులకు త్వరగా అందేలా కొద్దిరోజులు రేడియోలో కూడా ప్రసారం చేయాలని అభ్యర్థించాడు. సమాచారం చేరడానికి తమకు ఏకైక మార్గం ఒక్క రేడియోనేనని పేర్కొన్నాడు. అలాగే ప్రజా ప్రతినిధులను, జర్నలిస్టులను కూడా కలిసే అవకాశం కూడా ఇస్తారని భావిస్తున్నట్లు కోరాడు. సహచరులను సంప్రదించిన తర్వాత లొంగిపోయే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించాడు. సహచరులైన సోను దాదా, సతీష్ దాదాలకు సమాచారం అందేలా జర్నలిస్టులు మధ్యవర్తిత్వం వహించాలని కోరాడు.
తాజావార్తలు
-
RC 17: సినిమా ఓపెనింగ్ కాదు.. ఆఫీస్ మాత్రమే.!
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
-
Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
-
Jasprit Bumrah: బుమ్రా లేని టీమిండియా.. 250 రన్స్ చేసినా ఓటమి.. అసలు లోపం ఎక్కడుంది?
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!