ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది... దీంతో పెద్ద ఎత్తున వచ్చి ఇన్‌ఫ్లో రూపంలో తుంగభద్ర డ్యామ్‌లోకి వచ్చి చేరుతుంది.. అధిక ప్రమాణంలో జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది.
Fake Website: కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పేరుతో మరో నకిలీ వెబ్‌సైట్ వెలుగులోకి వచ్చింది. రాఘవేంద్ర స్వామి భక్తుల నమ్మకాన్ని వ్యాపారంగా మలచే ప్రయత్నంలో కొందరు వ్యక్తులు భక్తుల నుండి డబ్బులు వసూలు చేసేందుకు నకిలీ ప్రకటనలు చేస్తూ మోసం చేస్తున్నారు. బెంగళూరు జాతీయ రహదారి పక్కన రాంనగర్ వద్ద 253 అడుగుల శ్రీ రాఘవేంద్ర స్వామి విగ్రహం ఏర్పాటు చేస్తామంటూ, అలాగే శ్రీ మఠానికి హెలికాప్టర్ కొనుగోలు చేస్తామని నకిలీ…
రాఘవేంద్రస్వామిని దర్శించుకోవడంపై పలువురు పలు రకాలుగా చెప్పారు.. మా అమ్మకి ఫోన్ చేసి అభిప్రాయం అడిగా.. నీ మనసులో ఏముందో అదే మనస్పూర్తిగా ఆచరించు అని చెప్పిందని పేర్కొన్నారు. నా తల్లి కోరిక మేరకు శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నాను అని మంత్రి లోకేష్ చెప్పారు.
కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయం వేదపాఠశాలకు చెందిన విద్యార్థుల వాహనం కర్ణాటకలోని సింధునూరు సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు సహా డ్రైవర్ అక్కడిక్కడే చనిపోయారు. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఓ విద్యార్ధి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని.. కేసు నమోదు చేసుకున్నారు. మంగళవారం రాత్రి మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం సంస్కృత విద్యాపీఠం విద్యార్థులు (14…
కర్నూలు జిల్లా కూటమిలో మంటలు చల్లారడం లేదు. కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మిగనూరు, మంత్రాలయంలో టీడీపీతో మిత్రపక్షాలు ఢీకొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు తిక్కారెడ్డి.. చంద్రబాబు మంత్రాలయం టీడీపీ టికెట్ విషయంలో పునరాలోచించాలని సూచించారు. టికెట్ ఇవ్వక పోతే ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధమని ప్రకటించారు. ఇక, చంద్రబాబు కార్యాలయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి బ్రోకర్లు ఉన్నారు అంటూ ఫైర్ అయ్యారు.. చంద్రబాబు చుట్టూ ఉన్నవారు డబ్బులకు అమ్ముడు పోయి.. వైఎస్ జగన్ కోవర్టులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
Mantralayam : తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మృతి చెందడం పార్టీ కీ చాలా తీరని లోటు అని మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేత పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలో తెలుగు ప్రజల ఆశాజ్యోతి.. తెలుగు ప్రజల గుండెచప్పుడు, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు పన్నాగా వెంకటేశ్వర్లు స్వామి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గం ఇన్చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి పాల్గొని.. నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.