Mantralayam : తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మృతి చెందడం పార్టీ కీ చాలా తీరని లోటు అని మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేత పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. ఆయన కోసిగి టౌన్ లో సీనియర్ నాయకులు కోతుల తిక్కస్వామి, మాధవరం గ్రామంలో మఠం చెన్నయ్య స్వామి అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి వారి పార్ధీవదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి.. ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దహన సంస్కారాలకు అవసరమైన ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.