ఇసుక వ్యాపారం, పంచాయితీలు, భూ దందాలు, అక్రమ మద్యం వ్యాపారం చేస్తూ సంపాదనపై పడ్డారు తప్ప.. మంత్రాలయం నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదంటూ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపై ఫైర్ అయ్యారు తిక్కారెడ్డి.
Padayatra Organiser dies Near Mantralayam Temple: కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో విషాదం చోటు చేసుకుంది. రాఘవేంద్రస్వామి దర్శనానికి కర్ణాటక నుంచి పాదయాత్రగా వచ్చిన 500 మంది భక్తులకు ఆర్గనైజర్‌గా వ్యవహరించిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆర్గనైజర్ మృతి చెందడంతో అతడితో వచ్చిన 500 మంది భక్తులు రాఘవేంద్రస్వామిని దర్శించుకోకుండానే తిరిగి వెళ్లిపోయారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి… కర్ణాటకలోని బళ్లారి జిల్లా సిరిగుప్ప మండలం…
మంత్రాలయం సమీపంలో కర్ణాటక గిలకసూగూరు క్యాంపులో దారుణం జరిగింది. ఓ యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేసి అనంతరం ఆమెను హత్య చేశారు. హత్య చేయడమే కాకుండా ఆ యువతి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పవన్ రూ. 300 కోట్ల ప్యాకేజ్ ఇస్తే.. జై చంద్రబాబు అంటాడు అంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి. దమ్ము, ధైర్యం ఉంటే సింగిల్‌గా పోటీ చేయి, ప్రజల తీర్పు చూద్దాం అంటూ సవాల్ చేశారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్‌లో ముగిసింది.. తుంగభద్ర బ్రిడ్జిపై కర్ణాటకలోకి అడుగుపెట్టారు రాహుల్ గాంధీ… అయితే, ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు.. భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకున్న ఆయన.. ఇక్కడి వ్యక్తులతో నేను అనుభవించిన ప్రేమ బంధం లోతైనది మరియు దృఢమైనది అని రాసుకొచ్చారు.. అంతే కాదు.. ఈ ప్రేమకు…
ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర ముగించుకుని.. మరోసారి కర్ణాటకలో అడుగుపెట్టబోతున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. తుంగభద్ర డ్యామ్ మధ్యలో ఏపీ సరిహద్దు ముగిసి.. కర్ణాటక సరిహద్దులోకి ప్రవేశించనున్నారు రాహుల్ గాంధీ
ఇటీవల కాలంలో వరుసగా యువతీయువకుల ప్రేమ పలు వివాదాస్పద ఘటనలకు కారణమవుతోంది. తాజాగా ఇలాంటి ఉదంతం మరొకటి వెలుగు చూసింది. ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో ఓ ప్రేమజంట ప్రేమించుకున్నారనే కారణంగా వారి కుటుంబాల మధ్య వైరం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన శ్రీజ, శివాజీ అనే యువతీయువకులు ప్రేమించుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న శ్రీజ కుటుంబసభ్యులు ఆమెకు మూడురోజుల క్రితం రచ్చమర్రికి చెందిన భీమతో…