మరోవైపు మణిపూర్ మండిపొతున్నా కేంద్రం చోద్యం చూస్తుందని దుయ్యబట్టారు. గుజరాత్ తరహా కుట్రలు మణిపూర్ లో అంతకు మించి చేశారని ఆరోపించారు. మణిపూర్ లో విద్వేషాలు రెచ్చ గొట్టింది బీజేపీనేనని విమర్శించారు సీపీఐ నారాయణ అన్నారు.
మణిపూర్‌లో జీ20 ఈవెంట్‌ను నిర్వహించకపోవడంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ శనివారం ప్రశ్నలు సంధించారు. జీ20 సమ్మిట్‌ను ఉద్దేశించి అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. మణిపూర్‌లో పరిస్థితి సాధారణ స్థితి నెలకొంటే జీ20 సదస్సును అక్కడ ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.
తోవాయి గ్రామంలో ముగ్గురు మృతి చెందిన ఘటనపై.. గిరిజనులు నిరసన చేపట్టారు. కుకీ-జో కమ్యూనిటీ ఆధిపత్యం ఉన్న కాంగ్‌పోక్పి జిల్లాలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వందలాది మంది మహిళలు నిన్న మధ్యాహ్నం నుంచి జాతీయ రహదారిపై ధర్నా చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా అక్కడ నిరసనలు కొనసాగుతున్నాయి.
Manipur: మణిపూర్ .. ఈ పేరు గత కొన్ని రోజులగా దేశ ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్న విషయం తెల్సిందే. వెన్నులో వణుకుపుట్టేలా మణిపూర్ లో జరిగిన అల్లర్లు.. హత్యలు ఎంతటి సంచలాన్ని సృష్టించాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ మధ్యనే ఈ అల్లర్లు ఆగడంతో ప్రజలు కొద్దిగా ఊపిరి పీల్చుకుంటున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం రోజున మణిపూర్ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌లో కొన్ని అపార్థాలు, స్వార్థ ప్రయోజనాలు, విదేశీ కుట్రల కారణంగా మరణకాండ జరిగిందని, ప్రజలు చనిపోయినట్లు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ పేర్కొన్నారు.
77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుక సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
మణిపూర్ అంశంపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ పక్క మణిపూర్ వందరోజులుగా మండిపోతుంటే పార్లమెంట్ లో ఎంపీలు ఏం మాట్లాడరని విమర్శించారు. నువ్వా.. నేనా అన్నట్లు రాజకీయం చేశారే తప్ప సమస్య పరిష్కారం గురించి ఒక్కరైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.
జాతి హింసతో అట్టుడికిపోతున్న ఈశాన్య రాష్టమైన మణిపూర్‌లో అకృత్యాలు ఆగడం లేదు. అక్కడి మహిళలపై జరుగుతున్న ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశాన్ని కుదుపేసిన సంగతి తెలిసిందే. పార్లమెంట్‌లోని ఉభయసభల్లోనూ నిరసన జ్వాలలు చల్లారకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.