ప్రతిపక్ష కూటమి 'ఇండియా'లోని 16 పార్టీలకు చెందిన 21 మంది ఎంపీల బృందం హింసాత్మక మణిపూర్‌కు చేరుకుంది. హింసాత్మకంగా దెబ్బతిన్న రాష్ట్రంలో క్షేత్రస్థాయి పరిస్థితులను నేతలు అంచనా వేయనున్నారు.
సుమారు 3 నెలలుగా మణిపూర్‌లో జాతుల మధ్య హింస కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి తరువాత అత్యాచారం చేసి.. హత్య చేసిన వీడియో బయటికి వచ్చింది.
మణిపూర్ లో ఇటీవల ఆంక్షలు ఎత్తివేసిన నిమిషాల్లోనే మరోసారి అంతర్జాల వినియోగంపై ఆంక్షలు విధించింది. ఫార్వార్డ్ మెసేజులతో ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టిన కారణంగా మణిపూర్ ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు పెట్టింది.
మణిపూర్ లో హింసాకాండ ఆగడం లేదు. మరోసారి కాల్పులకు పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటనలో ఒక పాఠశాల, పది ఇళ్లకు నిప్పు పెట్టడంతో దగ్ధమయ్యాయి.