Akhilesh Yadav: మణిపూర్‌లో జీ20 ఈవెంట్‌ను నిర్వహించకపోవడంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ శనివారం ప్రశ్నలు సంధించారు. జీ20 సమ్మిట్‌ను ఉద్దేశించి అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. మణిపూర్‌లో పరిస్థితి సాధారణ స్థితి నెలకొంటే జీ20 సదస్సును అక్కడ ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు ‘జీ20 కా చునావ్ కనెక్షన్’ సెషన్‌లో భాగంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్, దేశంలోని ఇతర ప్రాంతాలలో చాలా జీ 20 ఈవెంట్‌లు జరిగాయి, కానీ మణిపూర్‌లో ఎందుకు నిర్వహించలేదని అఖిలేష్ ప్రశ్నించారు.
Read Also: Viral Video: మెట్రోలో అమ్మాయి స్టంట్ అదుర్స్.. వీడియో వైరల్
‘దేశవ్యాప్తంగా జీ20 సెషన్లను కేంద్రం నిర్వహిస్తోంది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీలతో సహా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. కానీ మణిపూర్ సమస్యపై సరిగా స్పందించడం లేదు. అక్కడ పరిస్థితులు సాధారణ స్థాయికి చేరాయని నాయకులు చెబుతున్నారు. నిజంగా అక్కడ అల్లర్లు లేకపోతే ప్రస్తుతం జరిగే జీ20 మీటింగ్‌లను మణిపూర్‌లో నిర్వహించవచ్చు.’ అని అఖిలేష్ యాదవ్ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న కార్యక్రమాలతో తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని, అయితే ప్రస్తుతం మణిపూర్‌లో పెద్ద సమస్య ఉందని అఖిలేష్ యాదవ్ అన్నారు.“దేశంలో ఒక రాష్ట్రం బాగానే ఉందని మీరు చెబుతుంటే, అక్కడ జీ20 ఈవెంట్ ఎందుకు నిర్వహించడం లేదు? బీజేపీ మణిపూర్‌లో జీ20 ఈవెంట్‌ను నిర్వహించి, పరిస్థితి బాగానే ఉందని ప్రపంచానికి చూపించాలి.” అని మళ్ళీ అడిగారు.