సురేందర్ రెడ్డి, అఖిల్ అక్కినేని కాంబోలో రూపొందుతోన్న ‘ఏజెంట్’ సినిమా మళ్లీ వాయిదా పడనున్నట్టు కొన్ని రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. చాలాకాలం నుంచి సెట్స్ మీదే ఉన్న ఈ సినిమా.. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఆగస్టు 12వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ చేశారు. షూటింగ్ జాప్యం వల్లే వాయిదాలు తప్పలేదని, ఈసారి తప్పకుండా చెప్పిన తేదీకే సినిమాని విడుదల చేస్తామని బల్లగుద్ది మరీ చెప్పారు. కానీ, తప్పని పరిస్థితుల్లో మళ్లీ సినిమాను…
ప్రామిసింగ్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో, హై బడ్జెట్ స్టైలిష్, యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటోంది ‘ఏజెంట్’ చిత్రం. ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. దేశభక్తి అంశాలతో రూపుదిద్దుకుంటున్న సినిమా కాబట్టి దీన్ని ఆగస్ట్ 12న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు తొలుత భావించారు. అయితే సినిమా షూటింగ్ లో జాప్యం జరుగుతున్న కారణంగా ఆ…
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఆయనకు అవకాశం దొరికినప్పుడల్లా సహనటులు, సన్నిహితుల చిత్రాలను క్లిక్ చేస్తూ ఉంటారు. తాజాగా అలా క్లిక్ చేసిన లిస్ట్ లో ఆయన కుమారుడు, నటుడు దుల్కర్ సల్మాన్ కూడా చేరిపోయారు. ఈ మేరకు దుల్కర్ ఇన్‌స్టా లో తండ్రి తీసిన కొన్ని స్టిల్స్ షేర్ చేశాడు. అంతే కాదు వాటికి క్యాప్షన్ కూడా జోడించాడు. ‘సీనియర్ చెప్పినప్పుడు’, ‘క్యాచ్ ది లైట్’, ‘కెమెరా వైపు చూడు’ ‘ఆర్టిఫిషియల్…
మలయాళ స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ మధ్య గత కొన్నేళ్ళుగా బాక్సాఫీస్ వార్ జరుగుతూ వస్తోంది. అయితే ఇటీవల కాలంలో పూర్తిగా మోహన్ లాల్ ఆధిపత్యం కొనసాగుతోంది. మమ్ముట్టి బాక్సాఫీస్ వద్ద బడా హిట్ కొట్టి చానాళ్ళయింది. తమ హీరో తప్పకుండా సూపర్ హిట్ తో వస్తాడని మమ్ముట్టి ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. వారి కోరిక గత వారం నెరవేరింది. మమ్ముట్టి తాజా చిత్రం ‘భీష్మపర్వం’ గత శుక్రవారం విడుదలై స్మాషింగ్ హిట్ సాధించింది.…
అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబోలో మొదటిసారిగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ అండ్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ “ఏజెంట్”. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో పూర్తి నిడివి ఉన్న ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు. తాజాగా ఆయన ఈ విషయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ ‘ఏజెంట్’ నుంచి ఆయన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ‘ది డెవిల్’ అంటూ మమ్ముట్టిని ‘ఏజెంట్’ అభిమానులకు పరిచయం చేశారు. ఇక ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈరోజు ప్రారంభం కానుంది.…
చిత్ర పరిశ్రమను కరోనా వదిలేలా కనిపించడం లేదు. రోజురోజుకు స్టార్లు కరోనా బారిన పడడం ఎక్కువైపోతోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని లేకుండా అందరు కరోనా బారిన పడడం భయాందోళనలకు గురిచేస్తోంది. ఇటీవల మాలీవుడ్ స్టార్ హీరో మమ్ముట్టి కరోనా బారిన పడిన విషయం విదితమే.. ప్రస్తుత్తం ఆయన ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మమ్ముట్టీ కుమారుడు, హీరో దుల్కర్ సల్మాన్ కి కూడా కరోనా సోకినట్లు నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని…
చిత్ర పరిశ్రమను కరోనా వదలడం లేదు. రోజురోజుకు ఇండస్ట్రీలో కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయి. స్టార్లందరూ కరోనా బారినపది ఐసోలేషన్స్ లో ఉండడంతో అభిమానులు భయాందోళనలకు గురవుతన్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అని లేకుండా అన్ని చోట్ల కరోనా విళయతాండవం సృష్టిస్తోంది. తాజాగా మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపారు. ” అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నేను నిన్న కోవిడ్ పాజిటివ్ బారిన…
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వయసు ఎంతో మీకు తెలుసా?! 70 సంవత్సరాలు!! చిత్రం ఏమంటే… ఆయనతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఎంతో మంది హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు, మరి కొందరు సినిమా రంగం నుండే తప్పుకున్నారు. మమ్ముట్టిని ఇప్పటికీ 70 సంవత్సరాల వ్యక్తిగా అంగీకరించడానికి ఎవరి మనసూ ఒప్పుకోదు. ఇటీవల మమ్ముట్టి తాను డిగ్రీ చదివిన ఎర్నాకులం మహారాజా కాలేజీ రీ-యూనియన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అందులో అతని క్లాస్ మేట్స్ తో కలిసి కొన్ని ఫోటోలు దిగాడు.…
దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం ‘కురుప్’ ఈ నెల12న విడుదల కానుంది. ఇదో గ్యాంగ్ స్టర్ కథ. రియల్ లైఫ్ గ్యాంగ్స్టర్ సుకుమార కురుప్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. కరోనా తర్వాత థియేటర్లలో విడుదలకాబోతున్న పెద్ద మలయాళ చిత్రమిది. గతేడాది సమ్మర్ లోనే విడుదల కావలసి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే డైరెక్ట్ డిజిటల్ విడుదలకు ఓప్పందం కూడా జరిగింది. కానీ ఆ ఒప్పందాన్ని కాదని…
ప్రస్తుతం టాలీవుడ్ మూవీస్ లో పరభాషా తారలకు డిమాండ్ బాగా ఉంది. ఇటీవల ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’తో తొలి హిట్ కొట్టిన అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘ఏజెంట్’ సినిమాలో కూడా అలా ఓ స్టార్ హీరో కీలక పాత్ర పోషించబోతున్నాడట. ఈ ఏడాది జనవరిలో ఆరంభమైన అఖిల్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ స్థాయిలో నిర్మాణం కానున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్ర…