Anasuya: టైటిల్ చూడగానే అనసూయ మాజీ ప్రియుడా..? ఎవరు..? అని కంగారుపడిపోకండి. సినిమాల్లో కొన్ని పాత్రలు ఎప్పటికి గుర్తిండిపోతాయి కదా.. అలా అనసూయ మాజీ ప్రియుడిగా నటించిన హీరోకు అను విషెస్ చెప్పింది. అతను ఎవరో కాదు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టీ.. నేడు మమ్ముట్టీ పుట్టినరోజు కావడంతో అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక తాజాగా అనసూయ కూడా మమ్ముట్టీ కి స్పెషల్ గా విష్ చేసింది. అనసూయ మొదటి మలయాళ చిత్రం భీష్మ పర్వం. మమ్ముట్టీ హీరోగా నటించిన ఈ చిత్రంలో అనసూయ హీరోయిన్ గా నటించింది. మమ్ముట్టీని ప్రేమించి వదిలేసిన మాజీ ప్రేమికురాలిగా అనసూయ కనిపించింది. ఇందులో మమ్ముట్టీ పెళ్లి చేసుకోకుండా భీష్ముడిగా మిగిలిపోతాడు. అతడికోసం మాజీ ప్రేమికురాలు అనసూయ ఇంటికి వస్తూ పోతూ ఉంటుంది. ఈ సినిమాలో అనసూయ పాత్ర చిన్నదే అయినా ఎంతో ప్రభావితం చేసే పాత్ర కావడంతో ఆమెకు మంచి పేరు వచ్చింది.
ఇక అందులో మమ్ముట్టీ పేరు మైఖేల్. అదే పేరుతో అనసూయ ఆయనను విష్ చేసింది. “మా మైఖేల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. సర్.. మీతో కలిసి నటించడం అనేది నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. మీకు ఎల్లప్పుడు ఆరోగ్యం, ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక గత కొన్ని రోజుల నుంచి అనసూయకు, ట్రోలర్స్ కు మధ్య ఆంటీ యుద్ధం జరుగుతున్న విషయం తెల్సిందే. చాలామంది మీద అనసూయ పోలీస్ కేసు కూడా పెట్టింది. ఇక అనసూయ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది.
Happiest of birthdays to our #Micheal #MegastarMammootty #Mammukka @mammukka Sir!! I will cherish forever my opportunity of working with you.. ❤️
Wishing you good health and happiness Sir!#HappyBirthdayMammukka pic.twitter.com/xQkEbP7mg3— Anasuya Bharadwaj (@anusuyakhasba) September 7, 2022