ఇండియా కూటమిలో కాంగ్రెస్-తృణమూల్ కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీలైనా.. ప్రత్యర్థి పార్టీల్లా ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకుని రోడ్డెక్కుతున్నారు. ఈ వ్యవహారం అధికార పార్టీకి అస్త్రంగా అవకాశం ఇస్తున్నారు. తాజాగా మమత చేసిన వ్యాఖ్యలు ఇరుపార్టీల మధ్య మరింత ఆజ్యం పోసినట్లుగా కనబడుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కనీసం 40 సీట్లైనా వస్తాయో? రావో? అనుమానమేనని బెంగాల్ సీఎం మమత వ్యాఖ్యానించింది. ఈ కామెంట్స్‌పై బెంగాల్ రాష్ట పీసీసీ చీఫ్, ఎంపీ అధీర్ రంజన్ చౌధరీ తీవ్రంగా స్పందిస్తూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
మమతా బెనర్జీ బీజేపీని చూసి భయపడుతున్నట్లు కనిపిస్తోందని అధీర్ రంజన్ వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీకి, బీజేపీకి కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించడం ఇష్టం లేదేమోనన్నారు. ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న మమత.. కాంగ్రెస్ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం భావ్యం కాదని హితవు పలికారు. ఇండియా కూటమిలో ప్రతిపక్షంగా ఉండాలని చేరినట్లు కనబడుతుందని అభిప్రాయపడ్డారు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారోనని మండిపడ్డారు. బీజేపీకి వత్తాసుగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఆయన తెలిపారు.
ఒకే కూటమిలో ఉంటూ ప్రత్యర్థుల్లా కాంగ్రెస్-తృణమూల్ కాంగ్రెస్ విమర్శలు చేసుకుంటున్నారు. ఇంకోవైపు కూటమిలోని పార్టీలన్నీ ఎవరికి వారే సీట్లు ప్రకటించేసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల వరకూ ఈ కూటమి ఉంటుందా? లేదంటే చీలికలు వచ్చి ముక్కలైపోతుందో వేచి చూడాలి.
#WATCH | Murshidabad, West Bengal | Congress MP and West Bengal Congress president Adhir Ranjan Chowdhury says, "Delay (in the resumption of Bharat Jodo Yatra) is because the local administration has been telling us since last night that Yatra should not take place. Why? Because… pic.twitter.com/ZTFeafeq0W
— ANI (@ANI) February 2, 2024