Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రం రాబోయే లోక్‌సభ ఎన్నికల ముందు రాష్ట్రంలోని ప్రజల ఆధార్ కార్డులను ‘డీయాక్టివేట్’ చేసిందని, తద్వారా ప్రజలకు వచ్చే ప్రయోజనాలు, సంక్షేమ పథకాలు పొందకుండా చేశారని ఆదివారం ఆరోపించారు.
Read Also: Aishwarya Shankar: భర్తతో విడాకులు.. ఇప్పుడు తండ్రి అసిస్టెంట్ తో శంకర్ కూతురి ఎంగేజ్మెంట్
బీర్భూమ్ జిల్లాలో జరిగిన ప్రజాపంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఒక వ్యక్తికి ఆధార్ లేకపోయినా, తమ ప్రభుత్వం వివిధ రాష్ట్ర సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందిస్తూనే ఉంటుందని అన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆధార్ కార్డుల్ని డీయాక్టివ్ చేస్తోందని, బెంగాల్ లోని అనేక జిల్లాల్లో ఆధార్ కార్డుల డీయాక్టివేషన్ జరిగిందని, వారు ఆధార్ కార్డుల్ని డీలింక్ చేస్తున్నారని, దీని వల్ల ప్రజలు బ్యాంకుల ద్వారా లక్ష్మీ భండార్, ఉచిత రేషన్ వంటి ప్రయోజనాలను పొందకుండా చేస్తున్నారని ఆరోపించారు.
అయితే ఆధార్ కార్డు లేకపోయినా పథకాల లబ్ధిదారులకు చెల్లిస్తూనే ఉంటాం.. ఒక్క లబ్ధిదారుడికి కూడా ఎలాంటి ప్రభావం ఉండదని ఆమె తెలిపారు. హర్యానా, పంజాబ్ రైతులు చేసున్న ఆందోళనకు ఆమె మద్దతు ఇచ్చారు. బెంగాల్ రైతులకు ఎలాంటి సమస్యలు లేవని అన్నారు. ఎంఎస్‌పీపై రైతులు చేస్తున్న నిరసనలకు సెల్యూట్ చేస్తున్నా అని, వారిపై దాడులను ఖండిస్తున్నట్లు మమతా బెనర్జీ అన్నారు.