Congress: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. మరో మూడు రోజుల్లో అంటే జూన్ 1న చివరిదైనా ఏడో విడత ఎన్నికలు జరగనున్నాయి. అయితే, మే 30, 31తేదీల్లో ప్రధాని నరేంద్రమోడీ కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర ప్రధాని ధ్యానం చేయనున్నారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండీ ధ్యానం చేయనున్నారు. అనంతరం జూన్ 1న ఆయన కన్యాకుమారి నుంచి ఢిల్లీ వస్తారు. 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు కూడా ప్రధాని ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించి, ప్రార్థనలు చేశారు.
READ ALSO: Manjima Mohan: పెళ్ళికి ముందే ప్రెగ్నెన్సీ.. చాలా బాధపడ్డాను- హీరోయిన్ ఆవేదన!!
ఇదిలా ఉంటే, ప్రధాని మోడీ ధ్యానం- మౌన వ్రతం గురించి కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఈ రోజు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. 48 గంటల పాటు మౌనంగా ఉన్న సమయంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రచారం చేయడాన్ని ఎవరినీ అనుమతించకూడదని ఆయన అన్నారు. ఏ నాయకుడైనా ‘‘మౌన వ్రతం’’ పాటించినా, ఏదైనా, మౌనవ్రతంలో అది పరోక్ష ప్రచారం కాకూడదని చెప్పారు. మే 30న 7 గంటల నుంచి జూన్ 1 వరకు మౌనం పాటించడం కూడా ప్రచారమే అని, తనను తాను హెడ్‌లైన్స్‌లో ఉంచుకోవడానికి వేసిన ఎత్తుగడగా ఆయన సింఘ్వీ పేర్కొన్నారు. జూన్ 1 సాయంత్రం 24-48 గంటల తర్వాత ప్రధాని మౌన వ్రత్ ప్రారంభించాలని మేము ఎన్నికల సంఘాన్ని కోరామని చెప్పారు. ఒక వేళ ఆయన రేపే దీనిని ప్రారంభించాలనుకుంటే దానిని ప్రింట్ లేడా ఆడియో విజువల్ ద్వారా మీడియా ప్రసారం చేయకుండా నిషేధించాలని ఈసీని కోరారు.
మరోవైపు ప్రధాని ధ్యానంపై బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఫైర్ అయ్యారు. ఎవరైనా వెళ్లి ధ్యానం చేయవచ్చని, ధ్యానం చేసేవారు ఎవరైనా కెమెరా తీసుకుంటారా..? అని ఆమె ప్రశ్నించారు. ఎన్నికలకు 48 గంటల ముందు ధ్యానం పేరుతో ఆయన వెళ్లి ఏసీ గదిలో కూర్చుంటారని ఆమె ఆరోపించారు. కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం చేస్తున్న దృశ్యాలను టీవీలో ప్రసారం చేస్తే, అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించడమే అవుతుందని ఆరోపిస్తూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ అన్నారు.
#WATCH | Delhi: On Congress delegation meeting the ECI, Senior advocate Abhishek Manu Singhvi says, "We told the Election Commission, that during the silence period of 48 hours, no one should be allowed to campaign, directly or indirectly. We have no objection to whatever any… pic.twitter.com/yzLsr7av89
— ANI (@ANI) May 29, 2024