Harish Rao : బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గజ్వేల్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు, రేవంత్ రెడ్డిని చిల్లర రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న నేతగా పేర్కొన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ, కేసీఆర్‌కు గజ్వేల్ అంటే తల్లీ-పిల్లల బంధంలా ఉందని, ఆయన అభ్యాసంతోనే గజ్వేల్ అభివృద్ధిలో దూసుకెళ్లిందని తెలిపారు. ఒకప్పుడు గజ్వేల్ హింసాత్మక సంఘటనలు, కుట్రలు, పోలీస్ కేసులతో నిండిన…
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. పదేళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే. కేసీఆర్ అంటే... ఎవరికి తెలియదని, ఆయన గురించి అంత ఉపోద్ఘాతం అవసరమా అనుకుంటున్నారా? యస్... మీరనుకునేది కరెక్టేగానీ... అసలు మేటరంతా అక్కడే ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
CM Revanth Reddy : రాబోయే 25 ఏండ్ల భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకొని, గ్రేటర్ హైదరాబాద్ సిటీలో మంచినీటి సరఫరాకు సరిపడే మౌలిక సదుపాయాల ప్రణాళికను తయారు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జలమండలి అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీ విస్తరణను దృష్టిలో పెట్టుకొని 2050 సంవత్సరం నాటికి పెరిగే జనాభా అవసరాలకు సరిపడేలా ఫ్యూచర్ ప్లాన్ ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఇంటింటికీ తాగునీటితో పాటు సీవరేజీ ప్లాన్ను రూపొందించాలని, అవసరమైతే ఏజెన్సీలు, కన్సల్టెన్సీలతో…
రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి అవసరం ఉందని ఆయన అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
మల్లన్నసాగర్ వర్సెస్ మూసీగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మూసీపై బీఆర్‌ఎస్, మల్లన్నసాగర్ పై కాంగ్రెస్ పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. గజ్వేల్‌లో మల్లన్నసాగర్ భూ నిర్వాసితులను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరామర్శించారు. మల్లన్నసాగర్ ముంపు బాధితులకు బీఆర్‌ఎస్ సరైన నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. తామెక్కడ మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఖాళీ చేయించలేదని.. మీలాగా బాధితులపై లాఠీలతో కొట్టించలేదని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. మల్లన్నసాగర్ బాధితుల సమస్యలను సీఎం…
గోదావరి నీళ్లతో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహుడి పాదాలు కడగాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ నుంచి యాదాద్రికి అధికారులు నీరు విడుదల చేశారు. ఈ మేరకు ఆఫ్టేక్-2 నుంచి గోదావరి జలాలు యాదగిరిగుట్ట మండలంలోని జంగంపల్లికి చేరుకున్నాయి. అటు నుంచి ఈ గోదావరి జలాలు యాదాద్రి నారసింహుడి చెంతకు చేరాయి. యాదాద్రి ఆలయంలో పంచకుండాత్మక మహాకుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభమైన రోజే గండి చెరువును అధికారులు కాళేశ్వరం నీటితో నింపారు.…
సినీనటుడు ప్రకాష్ రాజ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. తెలంగాణలో నిరుద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారని, 40 లక్షల మంది నిరుద్యోగులను కలవాలని ప్రకాష్ రాజ్ కి సూచించారు శ్రవణ్. ఇందిరా పార్క్ కి ఒక్కసారి వచ్చి చూడు. బుద్ది..జ్ఞానం లేదా ప్రకాష్ రాజ్ నీకు. రైతులు, నిరుద్యోగుల సమస్యలు నీకు గుర్తు లేవా..? ప్రతిపక్ష ఎమ్మెల్యే లను కొన్న కేసీఆర్ కి మద్దతు ఇవ్వడానికి సిగ్గుండాలి కదా ప్రకాష్…
తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఎన్నికల వ్యూహకర్త ప్రకాంత్ కిషోర్.. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రాజెక్టులను పరిశీలించే పనిలో పడిపోయారు.. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను సినీ నటుడు ప్రకాష్ రాజ్‌తో కలిసి ఇవాళ పరిశీలించారు పీకే.. ఆ తర్వాత మల్లన్నసాగర్ నిర్వాసితులతోనూ మాట్లాడారు.. రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను పరిశీలిస్తోంది పీకే టీమ్.. గత రెండు రోజులుగా తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ పర్యటన సాగుతోంది.. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం తుదిదశకు చేరుకొంది.…