తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఎన్నికల వ్యూహకర్త ప్రకాంత్ కిషోర్.. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రాజెక్టులను పరిశీలించే పనిలో పడిపోయారు.. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను సినీ నటుడు ప్రకాష్ రాజ్‌తో కలిసి ఇవాళ పరిశీలించారు పీకే.. ఆ తర్వాత మల్లన్నసాగర్ నిర్వాసితులతోనూ మాట్లాడారు.. రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను పరిశీలిస్తోంది పీకే టీమ్.. గత రెండు రోజులుగా తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ పర్యటన సాగుతోంది.. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం తుదిదశకు చేరుకొంది. ముఖ్యంగా మల్లన్నసాగర్ తెలంగాణకు గుండెకాయ. కాళేశ్వరం ప్రాజెక్టులోనే అత్యధిక నీటి నిల్వ సామర్థ్యమున్న, అత్యంత ఎత్తున ఉన్న జలాశయం మల్లన్నసాగర్ అయిన విషయం తెలిసిందే.
Read Also: Russia Ukraine War: కీవ్ సిటీ మా ఆధీనంలోనే ఉంది..
మరోవైపు.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను టార్గెట్ చేసిన సీఎం కేసీఆర్.. బీజేపీయేతర పక్షాలతో కలిసి జాతీయ ఫ్రంట్ ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు.. ఇదే సమయంలో.. తెలంగాణలో పీకేను తన ఎన్నికల వ్యూహకర్తగా కూడా సీఎం కేసీఆర్ నియమించుకున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే కేసీఆర్‌తో ప్రత్యేకంగా చర్చలు జరిపిన ప్రశాంత్ కిషోర్, ప్రకాష్ రాజ్.. ఇప్పుడు.. ప్రాజెక్టులను పరిశీలించడం ఆస్తికరంగా మారింది. ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చే పనిలో భాగంగానే.. మల్లన్నసాగర్‌ను పరిశీలించడంతో పాటు.. నిర్వాసితులను కూడా కలిసిఉంటారని విశ్లేషకులు చెబుతున్నమాట.