కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. మల్లన్న సాగర్ ను సీఎం కేసీఆర్ ప్రజలకు కాకుండా కల్వకుంట్ల కుటుంబానికి అంకితం చేశారన్నారు. మసిపూసి మారెడు కాయ చందంగా కేసీఆర్ వ్యవహరించారు. కాళేశ్వరం నుంచి వర్షాకాలంలో మల్లన్న సాగర్ కు చుక్క రాదు. కాళేశ్వరం నుంచి మల్లన్న సాగర్ కు నీళ్లు రావడానికి ఎన్ని రోజులు పడతాయి. ఒక టూరిజం స్పాట్ కోసం లక్ష కోట్ల రూపాయల ఖర్చు చేశారు.…
తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు మల్లన్నసాగర్‌ను సీఎం కేసీఆర్ బుధవారం నాడు జాతికి అంకితం చేశారు. సిద్ధిపేట జిల్లాలో మల్లన్నసాగర్ ప్రాజెక్టును ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ… తెలంగాణకు కరవు రాకుండా చేసే ప్రాజెక్టే కాళేశ్వరం అని పేర్కొన్నారు. దేశమంతా కరవు వచ్చినా ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు మాత్రం రాదని కేసీఆర్ అన్నారు. మల్లన్నసాగర్ ప్రారంభంతో కాళేశ్వరం కల సాకారమైందన్నారు. ఈ ప్రాజెక్టు ఆపేందుకు చాలా మంది ఎన్నో కేసులు వేశారని.. అయినా తాము వెనక్కి…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లన్న సాగర్‌కు చేరుకున్నారు. ఈరోజు మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను రాష్ట్రప్రజలకు అంకితం చేయనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా మల్లన్నసాగర్‌కు చేరుకున్నారు. మల్లన్న సాగర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్ అతిపెద్ద రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ లో 50 టీఎంసీల నీటిని నిల్వచేసే సామర్థ్యం ఉంటుంది. ఈ రిజర్వాయర్ ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట…
సిద్ధిపేట పట్టణ ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతూ తాగునీటి జలవలయాన్ని చేపడుతున్నామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. తాగునీటి ఎత్తిపోతలకు దీంతో ఇబ్బందులు తప్పుతాయన్నారు. నాలుగు దశాబ్దాల ముందు చూపుతో..మున్సిపల్ శాఖ శాశ్వత తాగునీటి అభివృద్ధి కో సం ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తుందన్నారు. సిద్ధిపేట రింగ్ మేన్ పైపులైన్ గ్రావిటీ ద్వారా పట్టణంలోని ప్రతీ కాలనీకి నీటిని తరలించే విధంగా ప్రణాళికలు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. మల్లన్నసాగర్ నుంచి సిద్ధిపేట మున్సిపాలిటీకి రింగ్ మేన్ కనెక్టీవిటీ…
కరీంనగర్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకంపై సమీక్ష నిర్వహించారు.. ఇక, సమీక్ష తర్వాత హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయిన తెలంగాణ సీఎం.. సిద్దిపేట జిల్లాకు రాగానే మల్లన్న సాగర్ ప్రాజెక్టును పరిశీలించారు.. తొగుట మండలం తుక్కుపూర్ లో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ను హెలికాప్టర్ నుంచి వీక్షించారు.. కాగా, ఇప్పటికే ఆరు మోటార్ల ద్వారా మల్లన్న సాగర్ లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు.. ఈ ఏడాది పది టీఎంసీల…