తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాలను సందర్శించేందుకు పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్ మాన్ రాష్ట్రానికి నేడు హైదరాబాద్ చేరుకోనున్నారు. మూడు రోజుల పాటు ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నేడు సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న భగవంత్‌సింగ్ మాన్ పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అయితే.. ఇప్పటికే తెలంగాణలో నీటి వనరులను సృష్టించడంతోపాటు ఆ నీటిని సద్వినియోగం చేసుకోవడానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు అద్భుతమని పంజాబ్ రాష్ట్ర అధికారులు ప్రశంసించారు.
Also Read : BBC Offices: బీబీసీ కార్యాలయాల్లో రెండో రోజూ ఐటీ సర్వే.. అమెరికా ఏమందంటే?
మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కూక్‌లోని కొండపోచమ్మ రిజర్వాయర్, గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువు మినీ ట్యాంక్‌బండ్‌ను పంజాబ్ రాష్ట్ర నీటిపారుదల, వ్యవసాయశాఖ అధికారుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఎస్‌ఈ వేణు, ఈఈ బాలాజీ, డీఈ మోతియా కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణం, భూసేకరణ, నీటి పంపింగ్, సామర్థ్యం తదితర అంశాలను పంజాబ్ అధికారులకు వివరించారు. అయితే.. గురువారం భగవంత్ సింగ్ మాన్ పాటు పంజాబ్ నీటిపారుదల శాఖ అధికారుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని జలాశయాలు, చెక్‌డ్యాంలను మరోసారి సందర్శించనుంది. నీటిపారుదల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను అధ్యయనం చేయనుంది.
Also Read : NTR 30: 24న మూవీ లాంచ్… అంటే అన్నారు కానీ మాస్టారు ఆ ఊహ ఎంత బాగుందో