Maldives: మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూపై చేతబడి చేసినందుకు ఇద్దరు మంత్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. పర్యావరణ మంత్రిత్వ శాఖలో స్టేట్ మినిష్టర్ ఉన్న షమ్నాజ్ సలీమ్, ప్రెసిడెంట్ కార్యాలయంలో మంత్రిగా పనిచేస్తున్న ఆమె మాజీ భర్త ఆడమ్ రమీజ్ మరియు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ హాజరుకానున్నట్లు సమాచారం. ఈ మేరకు భారత్ ఆహ్వానాన్ని ముయిజ్జూ స్వీకరించినట్లు అక్కడి మీడియా తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీయే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే గత రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారి బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది. కానీ ఎన్డీయే 292 సీట్లు గెలుచుకుంది.
మాల్దీవులు ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలోకి ప్రవేశించడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాలస్తీనాకు మద్దతుగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని సాకారం చేసేందుకు హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ ద్వీప దేశం చట్టపరమైన సవరణలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలోకి రాకుండా ఆ దేశ మంత్రిమండలి ఆదివారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
పర్యావరణంలో మార్పుల కారణంగా ఇబ్బందులు పడుతున్న మాల్దీవులకు అంతర్జాతీయ సమాజం నుంచి ఆర్థిక సాయం అందడం లేదని ఆ దేశ అధ్యక్షుడు ముహమ్మద్ ముయిజ్జూ ఆందోళన వ్యక్తం చేశారు.
Maldives: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్నాడు. ‘‘ఇండియా ఔట్’’ని నినాదంతో అధికారంలోకి వచ్చిన అతను మాల్దీవుల్లో మానవతా సేవల్లో పాలుపంచుకుంటున్న భారత సైన్యాన్ని తమ దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు.
మాల్దీవుల్లో నివసిస్తున్న భారత సైనికులంతా ఇప్పుడు స్వదేశానికి చేరుకున్నారు. మాల్దీవుల నుంచి భారత్ తన సైనికులందరినీ ఉపసంహరించుకున్నట్లు మాల్దీవుల ప్రభుత్వం ప్రకటించింది.
మాల్దీవులు- భారత్ మధ్య కొంత కాలంగా ఓ వివాదం కొనసాగుతోంది. కొద్దినెలల కిందట భారత ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటన చేశారు. ఆయన సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకున్న నేపథ్యంలో మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.
భారతీయుల రాకతో టూరిజం పరంగా అభివృద్ధి చెందిన మాల్దీవులు ఇప్పుడు కుదేలు పడుతోంది. భారత టూరిస్టులు మాల్దీవులకు బదులుగా లక్షదీప్ కు వెళ్తుండటంతో మల్దీవులు పర్యాటకం దివాళా తీసింది.