టర్కీ నుంచి కొనుగోలు చేసిన డ్రోన్లతో నిఘా ప్రారంభించినట్లు మాల్దీవుల జాతీయ రక్షణ దళం (ఎంఎన్‌డీఎఫ్) తెలిపింది. టర్కీతో ఒప్పందం ప్రకారం కొనుగోలు చేసిన డ్రోన్ విమానాన్ని చూపే వీడియోను కూడా ఎంఎన్‌డీఎఫ్ షేర్ చేసింది.
China: మాల్దీవుల సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడంలో తాము మద్దతు ఇస్తున్నామని చైనా మంగళవారం ప్రకటించింది. ఫస్ట్ బ్యాచ్ భారత సైనిక సిబ్బంది మాల్దీవులను విడిచిపెట్టింది. వారి స్థానంలో పౌరసిబ్బందిని నియమించింది. హెలికాప్టర్ సేవల్ని నిర్వహిస్తున్న భారత సైన్యం దేశాన్ని విడిచిపెట్టినట్లు మాల్దీవుల మీడియా సోమవారం తెలిపింది.
Maldives : కొద్ది రోజుల క్రితమే మాల్దీవులకు ఉచితంగా సైనిక సహాయం అందించేందుకు రక్షణ సహకార ఒప్పందంపై చైనా సంతకం చేసింది. మాల్దీవులు కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో గస్తీ కోసం టర్కీ నుండి డ్రోన్‌లను కొనుగోలు చేసింది.
Maldives: మాల్దీవులకు కొత్త అధ్యక్షుడిగా మహ్మద్ ముయిజ్జూ వచ్చిన తర్వాత భారత వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ, చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ వెళ్లిన సందర్భంలో మాల్దీవుల మంత్రులు ప్రధానిని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి. ఈ పరిణామాలతో భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకులు తమ టికెట్స్, హోటల్ బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నారు.
China: మాల్దీవులు, భారత్‌ని కాదని డ్రాగన్ దేశం చైనాతో సంబంధాలను పెంచుకుంటోంది. కొత్తగా వచ్చిన అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారత్ వ్యతిరేక, చైనా అనుకూల ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ఆ దేశంలో మానవతా సాయం అందిస్తున్న భారత సైనికులను వెళ్లిపోవాల్సిందిగా ఆదేశిస్తున్నారు. తాజాగా మాల్దీవులు, చైనాతో రక్షణ సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం జరిగిన తర్వాతి రోజే ముయిజ్జూ భాతర వ్యతిరేక స్వరం పెంచుతూ.. భారత్ సైనికులే కాకుండా, పౌర దుస్తుల్లో ఉన్న ప్రతీ ఒక్కరు వెళ్లిపోవాల్సిందే…
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ మరోసారి భారత్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. మే 10 తర్వాత భారత సైనిక సిబ్బంది, పౌర దుస్తుల్లో ఉణ్న వారు కూడా తమ దేశంలో ఉండరాదని హెచ్చరించారు. మాల్దీవుల్లో భారత సైనిక సిబ్బందిని , పౌర సిబ్బంది మాల్దీవులకు చేరుకున్న వారంలోపే ముయిజ్జూ నుంచి ఈ ప్రకటన వచ్చింది. భారత సైనిక సిబ్బంది మాల్దీవుల నుంచి ఉపసంహరించుకునేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. మార్చి 10 లోగా ఈ ప్రక్రియ…
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు మరోసారి భారత్‌పై విషం చిమ్మారు. తన 22 మంది సభ్యుల కేబినెట్‌లోని ముగ్గురు మంత్రులను విదేశీ దేశం ఆదేశాల కారణంగా మాల్దీవుల పార్లమెంట్ తిరస్కరించిందని ఆయన ఆరోపించారు. నిజానికి మాల్దీవుల్లో కొత్త ప్రభుత్వ కేబినెట్ ఏర్పాటైన తర్వాత అందులో చేరిన మంత్రులు పార్లమెంటు ఆమోదం పొందడం తప్పనిసరి.
మాల్దీవుల్లో వందలాది మంది భారత సైనికులు ఉన్నారంటూ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ చేసిన ఆరోపణలను ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అబ్దుల్లా షాహిద్ తోసిపుచ్చారు. తమ దేశ భూభాగంలో సాయుధులైన విదేశీ సైనికులెవరూ లేరని వెల్లడించారు.
Maldives: మాల్దీవుల్లో కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు వచ్చిన తర్వాత నుంచి భారత్ వ్యతిరేఖ, చైనా అనుకూల ధోరణిని అవలంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి మంత్రులు భారత ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవ్స్‌కి పర్యాటకంగా ఎక్కువ వెళ్లే భారతీయులు వారి టూర్లను క్యాన్సిల్ చేసుకున్నారు. ‘‘బాయ్‌కాట్ మాల్దీవులు’’ హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు. ఈ వివాదంతో మాల్దీవ్స్ పర్యాటక ఇండస్ట్రీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.