India-Maldives Tension: మాల్దీవుల్లో నివసిస్తున్న భారత సైనికులంతా ఇప్పుడు స్వదేశానికి చేరుకున్నారు. మాల్దీవుల నుంచి భారత్ తన సైనికులందరినీ ఉపసంహరించుకున్నట్లు మాల్దీవుల ప్రభుత్వం ప్రకటించింది. అయితే, అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ మే 10వ తేదీలోగా దేశం నుంచి భారత సైనికులందరినీ వెళ్లిపోవాలని గడువు విధించారు. నిన్నటితో( మే10) ఈ గడువు ముగిసింది. ఇక, ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు న్యూఢిల్లీలో చర్చలు జరుపుతున్న తరుణంలో ఈ బలగాల ఉపసంహరణ జరిగింది.
Read Also: Uttarpradesh: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దారుణ హత్య.. అనంతరం నిందితుడు ఆత్మహత్య
కాగా, మాల్దీవులలో మోహరించిన చివరి బ్యాచ్ భారత సైనికులను వెనక్కి పంపినట్లు మాల్దీవుల అధ్యక్ష కార్యాలయ ప్రధాన ప్రతినిధి హీనా వలీద్ తెలిపారు. అయితే, భారత సైనికుల సంఖ్యపై ఖచ్చితమైన సమాచారం ఇవ్వలేదు. ఎంతమంది సైనికులు తిరిగి వెళ్లిపోయారనేది తర్వాత తెలియజేస్తామని వలీద్ చెప్పుకొచ్చింది. భారతదేశం బహుమతిగా ఇచ్చిన రెండు హెలికాప్టర్లు, డోర్నియర్ విమానాలను నిర్వహించడానికి మాల్దీవులలో భారతీయ సైనిక సిబ్బందిని నియమించారు. అయితే, తొలి విడతలో 51 మంది సైనికులను భారత్‌కు పంపినట్లు మాల్దీవుల ప్రభుత్వం గతంలో ప్రకటించింది.
Read Also: CM YS Jagan: పిఠాపురంలో ప్రచారాన్ని ముగించనున్న సీఎం జగన్.. నేటి షెడ్యూల్ ఇదే..
అయితే, అధికారిక పత్రాలను ఉటంకిస్తూ మాల్దీవుల్లో 89 మంది భారతీయ సైనికులు ఉన్నట్లు మాల్దీవులు తెలియజేసింది. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం నాడు విలేకరులతో మాట్లాడుతూ.. మొదటి, రెండవ బ్యాచ్ భారతీయ సైనిక సిబ్బంది తిరిగి వచ్చారన్నారు. ఇప్పుడు మూడు భారతీయ విమానయాన ప్లాట్‌ఫారమ్‌లను, సాంకేతిక సిబ్బందిని కూడా వెనక్కి తిరిగి వచ్చారని పేర్కొన్నారు.