Maldives President: మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి మాల్దీవుల అధ్యక్షుడు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives President: భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ హాజరుకానున్నట్లు సమాచారం. ఈ మేరకు భారత్ ఆహ్వానాన్ని ముయిజ్జూ స్వీకరించినట్లు అక్కడి మీడియా తెలిపింది. ఎన్డీయే కూటమి తరఫున లోక్‌సభాపక్ష నేతగా ఎన్నికైన మోడీ రేపు (జూన్ 9న) ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ముయిజ్జూ ఇవాళే (శనివారం) ఢిల్లీకి చేరుకుంటారని ప్రచారం జరుగుతుంది. అయితే, భారత్ పర్యటనపై మాల్దీవుల అధ్యక్ష భవనం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రిలీజ్ కాలేదు.
Read Also: NZ vs AFG: వరల్డ్ కప్లో న్యూజిలాండ్కు షాకిచ్చిన ఆఫ్ఘనిస్తాన్..
Also Read
- Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
- Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
- Deepika Padukone: ప్రెగ్నెంట్ అయితే రెస్ట్ తీసుకోవాలా.. మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్.?
- Nara Lokesh: గణేష్ నిమజ్జనం వేళ డీజేలపై స్పందించిన లోకేష్.. హోంమంత్రి, డీజీపీకి విజ్ఞప్తి
అయితే, మరోవైపు ఎన్డీయే కూటమి విజయం సాధించిన నేపథ్యంలో నరేంద్ర మోడీని.. ఎక్స్ వేదికగా బుధవారం మహ్మద్ ముయిజ్జూ అభినందనలు తెలిపారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. శ్రేయస్సు, స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరు దేశాలకు ప్రయోజనం కలిగేలా కలిసి పని చేసేందుకు తాను రెడీగా ఉన్నట్లు ఆయన ఆ పోస్టులో వెల్లడించారు. ఒకవేళ మాల్దీవుల అధ్యక్షుడు భారత్‌కు వస్తే.. ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత మన దేశంలో ఆయన తొలి అధికారిక పర్యటన ఇదే అవుతుంది.
Read Also: Ramoji Rao: రామోజీరావు కోసం ఆస్కార్ రావాలని కోరుకున్న ఎం.ఎం.కీరవాణి.. ఎందుకో తెలుసా?
కాగా, గతేడాది నవంబర్ 17వ తేదీన మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన మహ్మద్ ముయిజ్జూ.. చైనా అనుకూల విధానాలను అనుసరిస్తున్నాడు. ఇండియాతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో పాటు మాల్దీవుల మంత్రులు మోడీపై చేసిన విమర్శలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణించాయి. దీంతో పాటు మాల్దీవులలో ఉన్న భారత సైన్యాన్ని పూర్తికి వెనక్కి పంపించేశాడు. ఇక, మోడీ ప్రమాణస్వీకారానికి పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ తదితర దేశాధినేతలు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు వారికి ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
-
Passport New Rules 2026: పాస్‌పోర్ట్ నిబంధనలు, ఫీజుల్లో మార్పులు.. కొత్త ఛార్జీలు ఇవే
-
Biggest Flop Movies : ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలు తెచ్చిన టాప్ సినిమాలు ఇవే..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
ట్రెండింగ్
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!