ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీయే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే గత రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారి బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది. కానీ ఎన్డీయే 292 సీట్లు గెలుచుకుంది. దీంతో కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కానుంది. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును కూడా మోడీ సమం చేశారు. ఇప్పటి వరకు వరుసగా మూడు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన ఏకైక ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ.
READ MORE: NDA Alliance Meet: నేడు ఎన్డీయే కూటమి భేటీ.. ప్రభుత్వ ఏర్పాటుపై కీలక చర్చలు..!
మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీకి ప్రపంచ దేశాల అధినేతలు అభినందనలు తెలిపారు. మాల్దీవులు ప్రెసిడెంట్ మహ్మద్ ముయిజ్జు ఎక్స్‌లో ఖాతాలో. “2024 ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, BJP, NDAకి అభినందనలు. రెండు దేశాల భాగస్వామ్య శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి నేను ఆసక్తిగా ఉన్నాను.” అని రాసుకొచ్చారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. తన ఎక్స్ ఖాతాలో “కొత్త ఎన్నికల విజయానికి, మంచి పనికి శుభాకాంక్షలు. ఇటలీ, భారతదేశాన్ని కలిపే స్నేహాన్ని బలోపేతం చేయడానికి, ఇరు దేశాల ప్రజల శ్రేయస్సుకు సంబంధించిన సమస్యలపై మేము కలిసి పని చేస్తూనే ఉంటాము.” అని పోస్ట్ చేశారు.
READ MORE: IND vs IRE: ప్రపంచకప్ వేటకు వేళాయె.. నేడు ఐర్లాండ్‌తో భారత్ ఢీ!
భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్‌గే భారత్‌తో సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని ఆకాంక్షించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించినందుకు నా మిత్రుడు ప్రధాని మోడీకి, ఎన్డీయేకు అభినందనలు అని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తన ఖాతాలో రాసుకొచ్చారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కూడా మోడీకి అభినందనలు తెలిపారు.