Maldives: మా దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడండి.. మాల్దీవులు మంత్రి అభ్యర్థన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయుల రాకతో టూరిజం పరంగా అభివృద్ధి చెందిన మాల్దీవులు ఇప్పుడు కుదేలు పడుతోంది. భారత టూరిస్టులు మాల్దీవులకు బదులుగా లక్షదీప్ కు వెళ్తుండటంతో మల్దీవులు పర్యాటకం దివాళా తీసింది. తాజాగా ఈ అంశంపై ఆ దేశ టూరిజం శాఖ మంత్రి ఇబ్రహీం ఫైజల్ మాట్లాడుతూ.. భారతీయులు మాల్దీవులకు రావాలని, పర్యాటకంపైనే ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని అభ్యర్థించారు. ఆయన సోమవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. భారత్, మాల్దీవులు మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయని అన్నారు. కొత్తగా ఎన్నికైన తమ దేశ ప్రభుత్వం భారత్‌లో కలిసి పనిచేయాలని అనుకొంటున్నదని వెల్లడించారు. తాము ఎల్లప్పుడూ శాంతియుత, స్నేహపూర్వక వాతావరణాన్ని కోరుకుంటామని పేర్కొన్నారు.
READ MORE: Kishan Reddy: నేను ధైర్యంగా చెప్తున్నా.. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు వస్తాయి..
Also Read
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
మాల్దీవుల అధ్యక్షుడిగా ముయిజ్జు బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు దేశాల మధ్య ద్వై పాక్షిక సంబంధాలు సైతం క్షీణించాయి. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత మొదలైన చర్చ మాల్దీవులకు చేరుకుంది. భారత ప్రధాని మోడీపై, భారత్‌పై మాల్దీవులు మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాల్దీవుల నేతల వ్యాఖ్యల వల్ల అక్కడి పర్యాటక రంగానికి నష్టం వాటిల్లింది. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, సచిన్ తెందూల్కర్ వంటి భారత ప్రముఖులు కూడా భారత తీరాలు, ద్వీపాల ప్రాధాన్యంపై మాట్లాడారు.ఈ చర్చ మొత్తం ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనతో మొదలైంది. మోదీ లక్షద్వీప్ పర్యటన చిత్రాలను చూసిన తర్వాత సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు ఇక సెలవులకు మాల్దీవులకు బదులుగా లక్షద్వీప్‌కు వెళ్లండని చెప్పడం ప్రారంభించారు. లక్షదీప్ లో పర్యాటక రంగం అభివృద్ధి చెందడం కోసం భారత్ కి చెందిన పెద్ద కంపెనీలు అక్కడ హోటల్స్ కట్టడం ప్రారంభించారు. మన దేశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు చిన్న దేశమైన మాల్దీవులు ఆర్థిక పరిస్థితి రాను రాను కుంచించుకుపోతోంది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పలువురు మంత్రులను సైతం ఆ ప్రభుత్వం తొలగించింది.
తాజావార్తలు
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు