Mahesh Goud: సుదీర్ఘ కాలం పాటు రాజకీయ చరిత్ర కలిగిన ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే సాయంత్రం హైదరాబాద్ వస్తున్నారు అని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నేరుగా గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మండల, జిల్లా అధ్యక్షులతో సమావేశమవుతారు.. కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ అందరికి సమన్యాయం చేస్తారు.. రేపటి ఖర్గే సభకి సామాజిక న్యాయ సమరా భేరి సమావేశంగా పేరు పెట్టామని చెప్పుకొచ్చారు. జైబాపు, జైభీం, జైసంవిధాన్ కార్యక్రమాన్ని ఆరు నెలలుగా విజయవంతంగా కొనసాగుతోంది అన్నారు. రేపు ఉదయం గాంధీ భవన్ లో జరిగే పీఏసీ సమావేశంలో ఖర్గే పాల్గొంటారు.. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఎల్బీ స్టేడియంలో కార్యకర్తలతో భేటీ అవుతారని మహేష్ గౌడ్ వెల్లడించారు.
Read Also: F-35B Fighter: కేరళలో చిక్కుకున్న ఎఫ్-35ని భారీ విమానంలో తరలించే అవకాశం..
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు పీసీసి చీప్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కవిత బీఆర్ఎస్ నాయకురాలుగా లెటర్ రాసిందా, జాగృతి నాయకురాలుగా రాసిందా అని ప్రశ్నించారు. మేము బీసీల కోసం వాగ్దానం చేసిన రోజు కవిత తీహార్ జైల్లో ఊసలు లెక్కపెడుతుంది అని ఎద్దేవా చేశారు. కవిత జైల్లో ఉండి ఊసలు లెక్కపెడుతూ బీసీల కోసం ఉద్యమం చేసిందా.. గొర్లు, బర్ల పేరుతో స్కామ్స్ చేసి దండుకుంది మీ ఫ్యామిలీ కాదా? అని ఆరోపించారు. రాజకీయ శూన్యంలో ఉన్న కవిత మనుగడకోసం మాట్లాడుతుంది.. ఏమి చేశారని లోకల్ బాడీలో బీఆర్ఎస్ 80 శాతం గెలుస్తుంది.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ఎందుకు ఓట్లు వేస్తారు అని అడిగారు. రాష్ట్ర సంపద దోచుకున్నారని మీకు ఓట్లు వేస్తారా?.. బీసీల విషయంలో కాంగ్రెస్ ఛాంపియన్ అని మహేష్ గౌడ్ చెప్పుకొచ్చారు.
Read Also: Diogo Jota: విషాదం.. కారు ప్రమాదంలో ఫుట్‌బాల్ క్రీడాకారుడు దుర్మరణం
ఇక, బీజేపీలో సమర్థవంతమైన బీసీ నాయకుడు లేడా? అని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ప్రశ్నించాడు. రామచందర్ రావుని అధ్యక్షుడిని చేశారు.. బీసీల విషయంలో చిత్త శుద్ధి ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్.. హరీష్ రావు అన్నట్లు అసెంబ్లీలో చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు.. హరీష్ రావుకు దమ్ముందా? అని అడిగారు. అలాగే, చంద్రబాబుతో చెట్టాపట్టాలు వేసుకుని బనకచర్ల ప్రాజెక్టుపై ఒప్పుకుంది మీరు కాదా? అని అడిగారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్టేట్మెంట్ పై తీవ్రంగా పరిగణిస్తున్నాం.. పార్టీలో అందరూ క్రమ శిక్షణతో ఉండాలి.. లేకపోతే, తీవ్ర పరిణామాలు ఎదుర్కొవల్సి వస్తుందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.