TPCC Mahesh Goud : కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ (Bandi Sanjay)పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన, తెలంగాణకు రావాల్సిన యూరియా సరఫరా విషయాన్ని కేంద్రం నుంచి వెంటనే తేవాల్సిన బాధ్యత వారిదేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజకీయ కక్షతోనే కేంద్రం యూరియాను అడ్డుకుంటోందని ఆరోపించారు.
Dharmasthala Case : ధర్మస్థల కేసులో ట్విస్ట్ .. మాట మార్చిన కార్మికుడు
రైతులు ఎరువుల కొరతతో ఆందోళనలో ఉన్న వేళ, కిషన్ రెడ్డి ఢిల్లీలో నిద్రపోతున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతుల కష్టాలను విస్మరిస్తూ, బీజేపీ నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారని గుర్తుచేశారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికార ఒప్పందం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేందుకు ఈ కుట్ర జరుగుతోందని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు సమంజసం కాదని మహేష్ గౌడ్ హితవు పలికారు.