కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో కొత్త సినిమాల ప్రకటనలు, ప్రస్తుతం సెట్స్ పై ఉన్న వాటి అప్ డేట్స్ వస్తాయో రావో తెలియని పరిస్థితి. అయితే కోట్లాది మంది అభిమానులను స్పెషల్స్ డేస్ సమయంలో నిరుత్సాహ పరచడానికి మన స్టార్ హీరోలు సిద్ధంగా లేరని తెలుస్తోంది. పేండమిక్ సిట్యుయేషన్ ను అర్థం చేసుకుంటూనే, సోషల్ మీడియా ద్వారా తమ చిత్రాల అప్ డేట్స్ ఇస్తే తప్పేంటీ అనే భావనను కొందరు స్టార్స్, అలానే వారితో…
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ ‘ఎస్ఎస్ఎంబి28’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి సినిమా కథ దగ్గర నుంచి హీరో పాత్ర, సినిమా టైటిల్, హీరోయిన్ ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ బాబు రా ఏజెంట్ గా నటించబోతున్నాడని, సినిమాకు మేకర్స్…
టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టిఎన్ఆర్ ను కరోనా బలి తీసుకుంది. ఆ విషయాన్ని ఇంకా మరువక ముందే ప్రముఖ సినీ పాత్రికేయుడు, నిర్మాత, సూపర్ హిట్ ఫిలిం పత్రిక, ఇండస్ట్రీహిట్.కామ్ అధినేత బి ఏ రాజు కన్నుమూశారు. ఆయన వయసు 61 సంవత్సరాలు. మధుమేహం వ్యాహితో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. బిఏ రాజు సతీమణి బి.జయ రెండేళ్ల క్రితమే మరణించారు. ఆయనకు ఇద్దరు కుమారులు అరుణ్…
జూనియర్ ఎన్టీఆర్ 38వ పుట్టినరోజు ఈ రోజు (మే 20). అయితే ఇటీవలే ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్ లో ఒంటరిగా ఉన్నాడు. కోవిడ్ -19 మహమ్మారి సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవద్దని జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులను కోరిన విషయం తెలిసిందే. అయితే తారక్ కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శక ధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే దుబాయ్‌లో మేజర్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేక్ పడింది. ఇదిలావుంటే, ఈనెల 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సర్కారు వారి పాట సినిమాలోని మహేష్ లుక్ తో చిన్నపాటి టీజర్ నే చిత్ర యూనిట్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. దీంతో…
సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడో సినిమా రానున్న విషయం తెలిసిందే. ‘అతడు’ ‘ఖలేజా’ వంటి సినిమాల తర్వాత వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ అభిమానులతో పాటు పరిశ్రమ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్న ఈ సినిమా మే 31న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. తాజాగా ఈ చిత్రంలో అక్కినేని హీరో సుమంత్ ఓ కీలక పాత్ర చేయబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. త్రివిక్రమ్…
ఈద్-అల్-ఫితర్ ను సాధారణంగా ఈద్ అని పిలుస్తారు. ఈ పండుగ రోజును దేశంలోని ముస్లిం సోదరులు సెలెబ్రేట్ చేసుకుంటారు. ఈ శుభ దినం ఇస్లామిక్ నెల షావ్వాల్ ఇరవై తొమ్మిదవ లేదా ముప్పయ్యవ రోజున పాటిస్తారు. రంజాన్ నెల మొత్తం ఉపవాసం చేసి, పవిత్ర మాసం చివరి రోజున రంజాన్ పండుగను జరుపుకుంటారు. దీనిని ఈద్ అని పిలుస్తారు. టాలీవుడ్ ప్రముఖులు ఈద్ సందర్భంగా ముస్లిం సోదరులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి, మోహన్…
మహేశ్ బాబు త్వరలోనే క్రికెట్ కోచింగ్ ఇవ్వబోతున్నాడట. ఎఎంబి మాల్ పెట్టి థియేటర్ బిజినెస్ లోకి ఎంటరైనట్లే క్రికెట్ కోచింగ్ సెంటర్ ఏమైనా మహేశ్ ఆరంభిస్తున్నాడేమో అనే సందేహం వస్తుందేమో! అలాంటిది ఏమీ లేదు. అనిల్ రావిపూడి సినిమాలో మహేశ్ క్రికెట్ కోచ్ గా కనిపిస్తాడట. ప్రస్తుతం మహేశ్ ‘సర్కార్ వారి పాట’, అనిల్ ‘ఎఫ్ -3’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. వారి వారి సినిమాలు పూర్తికాగానే తమ ఇద్దరి కాంబినేషన్ లో రెండో సినిమాని సెట్స్…
నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పలువురు సెలెబ్రిటీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నర్సులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ‘రియల్ కోవిడ్ హీరోలు నర్సులు’ అంటూ ట్వీట్ చేయగా… ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నర్సులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. “ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో కోవిడ్-19 సెకండ్ వేవ్‌తో పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ లోని మా నర్సులందరికీ కోసం ఇది… మీ అసాధారణ సహకారం అసమానమైనది. మీ కరుణ, తాదాత్మ్యం, బలంతో ప్రపంచాన్ని…
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు 41వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖుల నుంచి, అభిమానుల నుంచి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సుధీర్ బాబుకు సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే విషెస్ తెలిపారు. “హ్యాపీ బర్త్‌డే సుధీర్! మీకు ఎల్లప్పుడూ ఆనందం, విజయం లభించాలని కోరుకుంటున్నాను” అంటూ గతంలో సుధీర్ తో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేశారు. కాగా సుధీర్ కు మహేష్…