సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు వరుస అప్డేట్స్ సంతోషపరుస్తున్నాయి. నిన్న “సర్కారు వారి పాట” ఫస్ట్ నోటీసు ప్రకటించారు. జూలై 31న ఈ ఫస్ట్ నోటీసును రిలీజ్ చేయనున్నారు. ఈ రోజు అభిమానుల కోసం టీమ్ మరో అప్‌డేట్‌ను ఇచ్చింది. “సర్కారు వారి పాట” ఆడియో రైట్స్ ను పాపులర్ మ్యూజిక్ సంస్థ “సారేగమ సౌత్” కొనుగోలు చేసింది. మహేష్ బాబు ఆడియో రైట్స్ కొత్త ఆడియో కంపెనీకి ఇవ్వడం ఇదే మొదటిసారి. అది కూడా “సారేగమ సౌత్” కావడం విశేషం. “సర్కారు వారి పాట” ఆడియోతో వారి బ్రాండ్ కు మంచి లాభం చేకూరుతుంది.
Read Also : పరువు తీసిన ‘వాళ్లు’ పాతిక కోట్లు ఇవ్వాలంటోన్న మిసెస్ కుంద్రా!
సాధారణంగా మన తెలుగు హీరోలు ఎక్కువగా ‘ఆదిత్య మ్యూజిక్’కే ఆడియో రైట్స్ ఇచ్చేస్తుంటారు. ‘బాహుబలి’తో లహరి మ్యూజిక్ లైన్లోకి వచ్చి పెద్ద చిత్రాలను పట్టుకోవడం ప్రారంభించింది. ఇప్పుడు “సారేగమ సౌత్” టాలీవుడ్‌లోకి అడుగు పెట్టడం గమనార్హం. “సర్కారు వారి పాట” ఆడియో రైట్స్ మహేష్ మునుపటి చిత్రాల కంటే ఎక్కువ రేటుకు, రికార్డు ధరకు అమ్ముడయ్యాయట. జూలై 31న ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, ఆగష్టు 9న మహేష్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల కానుంది.