సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అందులో మహేష్ బాబు లుక్ ఆకట్టుకుంటోంది. ఫస్ట్ నోటీసు అంటూ ముందుగానే మహేష్ ఫస్ట్ లుక్ పై మేకర్స్ ఆసక్తిని రేకెత్తించారు. ఆసక్తితో పాటు అంచనాలను కూడా ఈ ఫస్ట్ లుక్ అందుకుంది.
Read Also : ‘విక్రాంత్ రోణ’ జాక్విలిన్ మోషన్ పోస్టర్ రిలీజ్
ఈ పోస్టర్ లో మహేష్ బాబు రిచ్ కార్ లో నుంచి బయటకు దిగుతున్నట్టుగా కన్పిస్తోంది. కార్, దాని ముందు అద్దం పగిలిపోవడం చూస్తుంటే ఇదేదో యాక్షన్ సీన్ లోని స్టిల్ అన్పిస్తోంది. ఆ దుమ్ము ఎఫెక్ట్, అవతల వైపు ఉన్న కొంతమందిని చూస్తుంటే ఇది ఖచ్చితంగా యాక్షన్ సీన్ అయ్యే అవకాశం ఉంది. ఇది దుబాయ్ లో షూటింగ్ జరుపుకున్న హై వోల్టేజ్ యాక్షన్ సీన్ అని అనుకుంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించారు.