సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాతో సరికొత్త రికార్డు సృష్టించి “సరిలేరు నీకెవ్వరు” అన్పిస్తున్నారు. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలై సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకున్న యాక్షన్, రొమాంటిక్, కామెడీ చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. మహేష్ బాబు చివరిసారిగా ఈ చిత్రంతోనే ప్రేక్షకులను పలకరించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ బాబుతో రష్మిక మండన్న మొదటిసారి కలిసి నటించింది. విజయశాంతి కీలకపాత్రలో నటించింది. తాజా అప్డేట్ ప్రకారం”సరిలేరు నీకెవ్వరు” చిత్రం మరో బాక్సాఫీస్ రికార్డు సృష్టించింది.
Reada Also : సూపర్ హీరోగా మారబోతున్న దగ్గుబాటి స్టార్
2020లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన టాప్ 50 సినిమాల్లో చోటు సంపాదించిన ఏకైక టాలీవుడ్ చిత్రం. ఈ జాబితాలో మహేష్ మూవీ 41వ స్థానంలో నిలిచింది. “సరిలేరు నీకెవ్వరు”ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఎకె ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ సహాయక పాత్రల్లో కన్పించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీని నిర్వహించారు. ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట”తో బిజీగా ఉన్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.