సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాతో సరికొత్త రికార్డు సృష్టించి “సరిలేరు నీకెవ్వరు” అన్పిస్తున్నారు. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలై సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకున్న యాక్షన్, రొమాంటిక్, కామెడీ చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. మహేష్ బాబు చివరిసారిగా ఈ చిత్రంతోనే ప్రేక్షకులను పలకరించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ బాబుతో రష్మిక మండన్న మొదటిసారి కలిసి నటించింది. విజయశాంతి కీలకపాత్రలో నటించింది. తాజా అప్డేట్ ప్రకారం”సరిలేరు నీకెవ్వరు” చిత్రం…
పాపులర్ మ్యాగజైన్ హలో! రిలీజ్ చేసిన ది పవర్ లిస్ట్ 2021లో టాలీవుడ్ నుంచి ఇద్దరు హీరోలు మాత్రమే స్థానం సంపాదించారు. ఆ ఇద్దరూ సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. పవర్లిస్ట్ ఒక నిర్దిష్ట రంగంలో లేదా ఒక నిర్దిష్ట దేశంలో అత్యంత ప్రభావవంతమైన, విజయవంతమైన వ్యక్తులను ప్రస్తావించడమే కాకుండా, వారు లైఫ్ లో సాధించిన ఘనతను కూడా ఈ మ్యాగజైన్ లో ప్రచురిస్తారు. ఇక ఇప్పటికే ఎన్నో రికార్డులను క్రియేట్…
మహేష్ బాబు హీరోగా “సర్కారు వారి పాట” చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో అత్యధిక భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఇటీవలే తాజా షెడ్యూల్ స్టార్ట్ చేసింది. అయితే మహేష్ బాబు చిత్రానికి కూడా ఇప్పుడు లీకుల బాధ తప్పట్లేదు. గత కొన్ని రోజులుగా ఈ చిత్రంలోని కొన్ని సెట్ వర్క్…
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’.. దర్శకుడు పరశురాం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మహేష్ ఫ్యాన్స్ ఎనలేని అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రం నుంచి ఇదివరకు టైటిల్ పోస్టర్ తప్ప, మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకొనే అంత అప్డేట్స్ ఏమి రాలేదు. అయితే ఈసారి ఫ్యాన్స్ ను ఏమాత్రం డిస్పాయింట్ చేయకుండా మహేష్ లుక్ ను విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆగస్టు 9న…
ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ షూటింగ్ తో బిజీబిజీగా ఉన్నాడు. అతని అభిమానులందరికీ ఇది సంతోషాన్ని కలిగించే వార్త. అయితే… మరో సెన్సేషనల్ న్యూస్ కూడా వాళ్లకు ఆనందాన్ని అందిస్తోంది. అదేమిటంటే… ముంబై బేస్డ్ పాపులర్ మీడియా ఏజెన్సీ ఆర్మాక్స్ మీడియా ఇటీవల ‘మోస్ట్ పాపులర్ మేల్ యాక్టర్స్ ఇన్ తెలుగు’ పేరుతో ఓ జాబితాను విడుదల చేసింది. అందులో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు మొదటి స్థానం దక్కింది. సెకండ్ ప్లేస్…
తమిళ స్టార్ దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం ‘నవరస’ వెబ్ సిరీస్ పై ఎక్కువగా దృష్టి పెట్టారు. మనిషిలోని తొమ్మిది భావోద్వేగాలను.. తొమ్మిది భాగాలుగా.. తొమ్మిది మంది దర్శకులతో ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘నవరస’ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఆగస్టు 6వ తేదీన ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. కాగా నవసర ప్రమోషన్స్ లో భాగంగా మణిరత్నం ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే చాలా విషయాలు ముచ్చటించిన ఆయన..…
సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు ఇవాళ పండగ రోజు. చాలా రోజుల గ్యాప్ తర్వాత ప్రిన్స్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్ లో పాల్గొన్నారు. తొలి షెడ్యూల్ దుబాయ్ లో జరిగిన తర్వాత మలి షెడ్యూల్ విషయంలో రకరకాల ప్లానింగ్స్ జరిగాయి. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా అవేవీ వర్కౌట్ కాలేదు. మొత్తం మీద కొద్ది రోజులుగా పరిస్థితులు చక్కదిద్దుకోవడంతో మహేశ్ బాబు ఈ రోజు సెట్ లోకి అడుగుపెట్టాడు. ఈ…
టాలీవుడ్ లో స్టంట్ కొరియోగ్రఫీ అంటే వెంటనే గుర్తొచ్చే రెండు పేర్లు ‘రామ్-లక్ష్మణ్’. నిజానికి రామ్, లక్ష్మణ్ వేరు వేరు పదాలైనా… ఆ ఇద్దర్నీ ఒకే వ్యక్తిలా చూడటం ఇండస్ట్రీకి అలవాటైపోయింది! అంతగా మన టాలెంటెడ్ ట్విన్స్ కమిట్మెంట్ తో కలసి పని చేస్తుంటారు. ఎప్పుడూ టాప్ హీరోల చిత్రాల్లోని ఫైటింగ్ సీక్వెన్సెస్ తో బిజీబిజీగా ఉంటారు… స్టంట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ ఒకేసారి చాలా క్రేజీ సినిమాల్లో యాక్షన్ కంపోజ్ చేస్తుంటారు. వారి డేట్స్ ఒక్కసారి…
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా “బెస్ట్ మేకప్ మ్యాన్” అంటూ అతనికి కితాబిచ్చాడు. మహేష్ నుంచి ప్రశంసలు అందుకున్న ఆ మేకప్ మ్యాన్ ఎవరో తెలుసుకోవాలంటే సూపర్ స్టార్ ట్విట్టర్ కు వెళ్లాల్సిందే. “నాకు తెలిసిన వారిలో బెస్ట్ మేకప్ మ్యాన్ పట్టాభి. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉండాలి. మీ మీద ఎప్పటికి ప్రేమ, గౌరవం అలాగే ఉంటుంది” అంటూ తన మేకప్ మ్యాన్ పై అభిమానాన్ని కురిపించారు మహేష్.…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా గుర్తుండిపోయే చిత్రాలుగా రావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. అతిత్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచి కథానాయికపై రకరకాల పేర్లు వినిపించాయి. తాజాగా మరో సీనియర్ కథానాయిక పేరు తెరపైకి వచ్చింది. లేడీ సూపర్ స్టార్…