సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు దగ్గర పడుతుండడంతో అభిమానుల్లో ఉత్సాహం మొదలైంది. ఆగస్ట్ 9న మహేష్ పుట్టినరోజు. దీంతో ఇప్పటి నుంచే తమకు ఇష్టమైన నటుడిపై అభిమానం చూపించుకోవడానికి పలు సన్నాహాలు మొదలు పెట్టేశారు. ప్రతి ఏడాది మహేష్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు రక్తదానం, అన్నదానం వంటి పలు సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం సూపర్ స్టార్ స్వయంగా అభిమానులకు తన బర్త్ డే విష్ ఏంటో…
“సర్కారు వారి పాట” చిత్ర నిర్మాతలు రీసెంట్ గా ఫస్ట్ నోటీసు అంటూ సినిమా నుంచి మహేష్ బాబు లుక్ ను విడుదల చేశారు. పొడవాటి జుట్టుతో, ఖరీదైన ఎరుపు రంగు కారులో మహేష్ బాబు కన్పించిన పోస్టర్ అభిమానుల అంచనాలను పెంచింది. “సర్కారు వారి పాట” ఫస్ట్ నోటీసు పోస్టర్ లో ముగ్గురు బైకర్లు కన్పించడం ఆసక్తిని రేకెత్తించింది. ఈ పోస్టర్ ద్వారానే మేకర్స్ జనవరి 13న సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అంటే సంక్రాంతి…
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రం నుంచి ఇప్పటికే “సర్కారు వారి పాట” ఫస్ట్ లుక్ అంటూ రిలీజ్ చేసిన మహేష్ బాబు పోస్టర్ సూపర్ స్టార్ అభిమానును ఆకట్టుకుంది. ఈ సినిమాను 2022 జనవరి 13న విడుదల చేయబోతున్నట్టు ఈ పోస్టర్ ద్వారానే వెల్లడించారు. మొత్తానికి సంక్రాంతి బరిలో మహేష్ బాబు కూడా “సర్కారు వారి పాట” పడబోతున్నాడు. ఇక…
టోక్యో ఒలింపిక్స్ 2021లో హైదరాబాద్కు చెందిన భారతీయ షట్లర్ పివి సింధు కాంస్య పతకం సాధించింది. ఆమె చైనాకు చెందిన హి బింగ్జియావోను 2 వరుస సెట్లలో ఓడించింది. సింధు ఇప్పుడు వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలు సాధించిన రెండవ భారతీయ అథ్లెట్. ఈ మ్యాచ్లో విజయంతో ఆమె అరుదైన ఘనతను సాధించింది. కాంస్య మ్యాచ్లో సింధు చారిత్రాత్మక విజయం సాధించినందుకు అభినందన సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. “సింధు అద్భుతమైన విజయంతో మేమంతా ఉల్లాసంగా ఉన్నాము. టోక్యో 2020లో…
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అందులో…
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు వరుస అప్డేట్స్ సంతోషపరుస్తున్నాయి. నిన్న “సర్కారు వారి పాట” ఫస్ట్ నోటీసు ప్రకటించారు. జూలై 31న ఈ ఫస్ట్ నోటీసును రిలీజ్ చేయనున్నారు. ఈ రోజు అభిమానుల కోసం టీమ్ మరో అప్డేట్ను ఇచ్చింది. “సర్కారు వారి పాట” ఆడియో రైట్స్ ను పాపులర్ మ్యూజిక్ సంస్థ “సారేగమ సౌత్” కొనుగోలు చేసింది. మహేష్ బాబు ఆడియో రైట్స్ కొత్త ఆడియో కంపెనీకి ఇవ్వడం ఇదే మొదటిసారి. అది కూడా…
సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తన సితార తరచూ సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. వాస్తవానికి సితారకు కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆమెకు సంబంధించి ఏ పిక్ బయటకు వచ్చినా వెంటనే వైరల్ చేస్తుంటారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. సొంత యూట్యూబ్ ద్వారా అభిమానుల సంఖ్యను పెంచుకుంటోంది. తాజాగా అదే యూట్యూబ్ ఛానల్ లో వీక్షకులకు అక్రిలిక్ పెయింటింగ్ పాఠాలు చెప్పుకొచ్చింది. వీడియోలో స్కై పెయింటింగ్ ఎలా వేయాలన్న విషయాన్ని…
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ తో ఉన్న పిక్ ను షేర్ చేసుకుంటూ “అతి త్వరలో అప్డేట్ వస్తుంది. సిద్ధంగా ఉండండి… ఆగష్టు వరకు వెయిట్ చేయలేను” అంటూ తమన్ ట్వీట్ చేశారు. దీంతో ఆ అప్డేట్ కోసం సూపర్ స్టార్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బర్త్ డే…
వచ్చే యేడాది సంక్రాంతి బరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేశ్ బాబు పోటీ పడబోతున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ మూవీస్ విడుదల తేదీలను వరుసగా ప్రకటిస్తున్న సమయంలో మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని 2022 సంక్రాంతికి విడుదల చేయబోతున్నామని ఈ యేడాది జనవరి 29న నిర్మాతలు ప్రకటించారు. అయితే ఆ తర్వాత కరోనా కారణంగా సినిమా షూటింగ్ షెడ్యూల్స్ అటూ ఇటూ అయినా… చేతిలో చాలా సమయమే ఉంది కాబట్టి… సంక్రాంతికే…
దాదాపు రెండేళ్ళ క్రితం రూ. 1500 కోట్ల భారీ వ్యయంతో మూడు భాషల్లో, మూడు భాగాలుగా ‘రామాయణ’ చిత్రాన్ని నిర్మిస్తామని అల్లు అరవింద్, నితీష్ మల్హోత్ర, మధు మంతెన ప్రకటించారు. ఈ త్రీడీ మూవీని నితీశ్ తివారి, రవి ఉద్యావర్ దర్శకత్వం వహిస్తారని చెప్పారు. అప్పటి నుండీ ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉన్న ఈ సినిమాలో రాముడిగా ప్రిన్స్ మహేశ్ బాబు నటిస్తాడని, సీతగా దీపికా పదుకునే, రావణాసుడి పాత్రను హృతిక్ రోషన్ పోషిస్తారనే ప్రచారం జరిగింది.…