తండ్రికి తగ్గ తనయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తండ్రి కృష్ణ తన పేరు ముందు ‘సూపర్ స్టార్’ను విశేషణంగా మార్చుకున్నారు. ఇక తనయుడు మహేశ్ బాబు సైతం ‘సూపర్ స్టార్’గా అభిమానుల మదిలో నిలిచారు. బాలనటునిగానే భళా అనిపించారు మహేశ్. తండ్రి కృష్ణను నటశేఖరునిగా జనం మదిలో నిలిపిన ‘అల్లూరి సీతారామరాజు’ గెటప్ ను బాల్యంలోనే ధరించి పరవశింప చేశారు మహేశ్. ఇక చిత్రసీమలో యంగ్ హీరోగా అడుగు పెట్టిన తరువాత తండ్రి అడుగుజాడల్లోనే పయనిస్తూ ఫ్యాన్స్ ను మురిపించారు మహేశ్. తెలుగు చిత్రసీమకు కౌబోయ్ ని పరిచయం చేసిన కృష్ణ తనయునిగా మహేశ్ ‘టక్కరిదొంగ’లో కౌబోయ్ గా జనం ముందు నిలిచారు. వైవిధ్యం కోసం కృష్ణ ‘అఖండుడు’లో మాయమై పోయే పాత్రలో నటిస్తే, మహేశ్ ‘నాని’లో బాలుని నుండి ఏకంగా యువకునిగా మారే విలక్షణమైన పాత్రలో కనిపించారు. తన కుటుంబానికి అన్యాయం చేసిన వారిని మట్టుపెట్టడానికి ‘పగసాధిస్తా’నంటూ కృష్ణ ఆ రోజుల్లో సందడి చేస్తే, ‘నిజం’ నిగ్గు తేలుస్తానంటూ మహేశ్ తన కెరీర్ లో ముందుకు సాగారు. ఇలా పలు విధాల నటనలో తండ్రి కృష్ణను గుర్తు చేస్తూ ‘తండ్రికి తగ్గ తనయుడు’ అనిపించుకున్నారు మహేశ్.
తండ్రిని మించిన తనయుడు
Also Read
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
- Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
కొన్ని విషయాల్లో తండ్రి కృష్ణను అనుసరించిన మహేశ్, మరికొన్ని చోట్ల తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారు. కృష్ణ కెరీర్ లో ఉత్తమ నటునిగా ఒక్క నంది అవార్డు కూడా లభించలేదు. అయితే ‘నిజం’తో తొలిసారి ఉత్తమ నటునిగా నందిని అందుకున్న మహేశ్, ఆ తరువాత ‘అతడు, దూకుడు, శ్రీమంతుడు’ చిత్రాల ద్వారా కూడా ఉత్తమ నటునిగా నంది అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే కృష్ణ నటజీవితంలో మొత్తం 300పై చిలుకు చిత్రాలలో కేవలం రెండంటే రెండు డైరెక్ట్ జూబ్లీస్ ఉన్నాయి. అవి ఏవంటే ‘పండంటి కాపురం’, ‘అల్లూరి సీతారామరాజు’. ఈ రెండు చిత్రాలు కూడా కృష్ణ సొంత చిత్రాలు కావడం విశేషం. అయితే మహేశ్ బాబు కెరీర్ లో నాలుగు చిత్రాలు డైరెక్ట్ గా నాలుగు ఆటలతో సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి. అవి ఏవంటే “మురారి, ఒక్కడు, అతడు, పోకిరి”. మరో విశేషమేమంటే ఈ నాలుగు చిత్రాలు హైదరాబాద్ లోని సుదర్శన్ 35 ఎమ్.ఎమ్.లో సిల్వర్ జూబ్లీ జరుపుకొని ఓ చెరిగిపోని రికార్డును మహేశ్ సొంతం చేశాయి. ‘పోకిరి’ చిత్రం అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది.
ఆ తరువాత కూడా మహేశ్ కు “దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు” వంటి సూపర్ హిట్స్ దక్కాయి. వీటిలో ‘శ్రీమంతుడు’ కూడా రజతోత్సవం చేసుకుంది.
తండ్రిలాగే మహేశ్ కూడా నిర్మాతగా మారారు. అయితే తండ్రిలాగా అదే పనిగా ఓ ప్రొడక్షన్ కంపెనీ పెట్టి, ఆ బ్యానర్ పైనే చిత్రాలను నిర్మించకుండా, తనతో సినిమాలు నిర్మించేవారితో భాగస్వామిగా కలసి సినిమాలు తీస్తున్నారు మహేశ్. ఆయన నిర్మాణ భాగస్వామిగా ‘ఎమ్.బి.ప్రొడక్షన్స్’ బ్యానర్ పై నిర్మితమైన తొలిచిత్రం ‘శ్రీమంతుడు’. ఈ సినిమా మంచి విజయాన్ని చూసింది. ఆ తరువాత “బ్రహ్మోత్సవం, సరిలేరు నీకెవ్వరు” వంటి చిత్రాల నిర్మాణంలోనూ పాలు పంచుకున్నారు. ఆ సినిమాల ద్వారా మహేశ్ కు మంచి లాభాలే వచ్చాయి. కృష్ణ హీరోగా చిత్రాలు నిర్మించి, తరువాత ఆయనకు బ్యాలెన్స్ పెట్టిన వారు ఎందరో ఉన్నారు. అయినా కృష్ణ ఏమీ అనకుండా అలాంటి వారికి సైతం మళ్ళీ కాల్ షీట్స్ ఇచ్చేవారు. ఈ విషయంలో మాత్రం మహేశ్ బాబు చాలా నిక్కచ్చిగా ఉంటారని తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకొనే హీరోగా మహేశ్ బాబు సాగుతున్నారు. మునుముందు ఆయన ఎలాంటి విజయాలు సాధిస్తారో చూడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!